మెగాస్టార్ కోసం ఖతర్నాక్ విలన్!

Sat Jun 25 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

biju menon villain in megastar movie

ఈ మధ్య తెలుగులో మలయాళ రీమేక్ ల జాతర జరుగుతోంది. స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ మలయాళ రీమేక్ లలో నటిస్తూ సక్సెస్ లు సొంతం చేసుకుంటున్నారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `భీమ్లానాయక్` మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే.ఈ మూవీ తో పాటు మరో మలయాళ మూవీ కూడా రీమేక్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో రూపొందుతున్న `గాడ్ ఫాదర్` మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` ఆధారంగా రీమేక్ అవుతోంది.

ఇక సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ 2020లో విడుదలై చిన్న చిత్రాల్లో సంచలన విజయం సాధించిన మలయాళ మూవీ `కప్పెల`ని తెలుగులో ఓ యంగ్ హీరోతో రీమేక్ చేస్తోంది. ఇలా మలయాళ సినిమాల వెంట పడుతున్న మనవాళ్లు ఇప్పడు స్టార్ ల వెంట కూడా పడుతున్నారు. ఇప్పటికే మలయాళ క్రేజీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ `సలార్` మూవీలో నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా వుంటే మరో మలయాళ స్టార్ తెలుగులో నటించబోతున్నాడు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి మూవీలో కావడం విశేషం. గత కొన్నేళ్ల క్రితం మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ మూవీ `ఖతర్నాక్`. ఈ మూవీలో విలన్ గా నటించిన మలయాళ నటుడు బీజు మీనన్. ఆ తరువాత ఈ మూవీ విడుదలైన ఏడాదే గోపీచంద్ నటించిన `రణం`లోనూ విలన్ గా నటించి ఆకట్టుకున్నారు.  

మళ్లీ ఇన్నేళ్లకు బీజు మీనన్ తెలుగులో మెగాస్టార్ మూవీలో కనిపించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి డైరెక్ట్ చేస్తున్న మూవీ కోసం బీజు మీనన్ ని మళ్లీ రంగంలోకి దింపేస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్న ఈమూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తమిళ నటుడు సముద్రఖని ఇటీవల వరుస సినిమాల్లో విలన్ గా నటిస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు.

అతన్ని మళ్లీ రిపీట్ చేయడం బాగోదని బావించిన మైత్రీ మూవీ మేకర్స్ మలయాళ నటుడు బీజు మీనన్ ని చిరు కోసం విలన్ గా రంగంలోకి దింపేయాలని ప్లాన్ చేస్తున్నారట. ముందు ఈ మూవీ కోసం భారీ క్రేజ్ వున్న విలన్ ని తీసుకోవాలని ప్లాన్ చేశారట. అయితే బీజు మీనన్ అయితే బాగుంటుందని మేకర్స్ భావించడం తో ఆయన రీ ఎంట్రీ లాంఛనమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇది ఫైనల్ అయితే బీజు మీనన్ మరో తెలుగు మూవీలోనూ విలన్ గా నటించే అవకాశం వుందని చెబుతున్నారు.