సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్సులకు పెద్ద దెబ్బ?

Thu Jun 10 2021 18:00:01 GMT+0530 (IST)

big blow to multiplexes

కరోనా మొదటి వేవ్ తగ్గాక టాలీవుడ్ పుంజుకున్న తీరుకు సర్వత్రా ప్రశంసలు కురిసాయి. అన్ని పరిశ్రమలు ఇటువైపే చూశాయి. అలా కంబ్యాక్ అవ్వాలని ఇరుగు పొరుగు పరిశ్రమలు ఆశించాయి. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ అనంతరం టాలీవుడ్ లో అదే రిపీటవుతుందా?  టాలీవుడ్ తిరిగి కంబ్యాక్ అవుతుందా?  తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రంగం తిరిగి కోలుకునే వీలుంటుందా? ఇవన్నీ ఇప్పటికి శేష ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.ఇప్పటికిప్పుడు రిలీజ్ ల కోసం వెయిటింగులో ఉన్న వాటిలో చాలా క్రేజీ సినిమాలున్నాయి. హిట్లు కొట్టే స్టామినా ఉన్నవి జనాల్లో హైప్ క్రియేట్ చేసేవి మెండుగానే ఉన్నా కానీ ఇంకా ఏదో సందేహం. ఇకపై 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుస్తారని అంటున్నారు.. కానీ జనం థియేటర్లకు వస్తారా.. ధైర్యం చేస్తారా? అన్నదే అసలు పాయింట్.

సెకండ్ వేవ్ దెబ్బకి థియేటర్లు తెరిచినా.. జనాలు థియేటర్లకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఒక సెక్షన్ లో గుసగుస.  దీనికి తోడు థియేట్రికల్ రంగానికి దెబ్బ కొట్టేలా.. ఓటిటిలు కూడా ఎక్కువు రేట్లు ఇచ్చి క్రేజీ సినిమాల్ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అలా కొనేస్తే థియేటర్లకు కంటెంట్ చాలదు. దీంతో ప్రస్తుతం చాలా సింగిల్ స్క్రీన్లు.. మాల్స్ - మల్టీప్లెక్స్ స్క్రీన్లు కూడా మూత పడే పరిస్థితులు ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా మొదటి వేవ్ సమయంలో అగ్రనిర్మాత డి.సురేష్ బాబు విశ్లేషించిన చాలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓటీటీ పుంజుకుంటుంది.. థియేట్రికల్ రంగం ఇప్పట్లో కోలుకోదని నిపుణుడైన మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ సురేష్ బాబు మొదటి వేవ్ సమయంలోనే అంచనా వేసారు. ఇకపై జనం ముందున్న హోప్ ఒకే ఒక్కటి. 60 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యాక కోవిడ్ స్ప్రెడ్ తగ్గుతుందన్న ఆశ... ఈ దసరా నాటికైనా పూర్తిగా కోవిడ్ అంతమవుతుందని బిగ్ హోప్.....! అవ్వాలనే ఆశిద్దాం.. కోవిడ్ ని సీజనల్ వ్యాధిగా చూస్తూ ఇప్పటికే జనం మొండి ధైర్యానికి అలవాటు పడ్డారు కాబట్టి ఇదేమైనా మంచి రిజల్ట్ నిస్తుందేమో!!