మైనస్14 డిగ్రీల చలిలో బెల్లం శ్రీదేవి

Sat Jan 29 2022 08:00:01 GMT+0530 (IST)

bellam Sridevi in ??minus 14 degree cold

ఇటీవల విహారం కోసం స్టార్ హీరోయిన్ అతి శీతల ప్రదేశమైన స్విట్జర్లాండ్ కి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి అందాల మధ్య స్కీయింగ్ చేస్తూ సరికొత్త అనుభూతికి లోనైంది. ఖాలీ సమయాన్ని వృధా చేయడం ఇష్టం లేని సామ్ స్విట్జర్లాండ్ మంచు పర్వతాలపై స్కీయింగ్ నేర్చుకుంటూ సరికొత్త ఛాలెంజ్ ని స్వీకరించి మొత్తానికి పడుతూ లేస్తూ ...లేస్తూ పడుతూ నేర్చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలతో పాటు ఫొటోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇదిలా వుంటే మరో హీరోయిన్ రాశిఖన్నా మైనస్ డిగ్రీల చలిలో విహరిస్తూ ఆ ఫొటోలని షోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అత్యంత శీతలంగా మారిన రష్యా రాజధాని మాస్కో నగరంలో ప్రస్తుతం రాశి విహరిస్తోంది. అక్కడి ప్రధాన నగరాల్లో ఇప్పుడు మైనస్ డిగ్రీల చలి దడ పుట్టిస్తోందట. రష్యా వీధుల్లో తిరుగుతున్న ఓ ఫొటోని షేర్ చేసింది రాశిఖన్నా. పూర్తిగా కప్పబడి అక్కడి రోడ్లు కనువిందు చేస్తున్నాయి.  

తాను మైస్ 14 డిగ్రీల చలితో తడిసి ముద్దవుతున్నానని తాజాగా షేర్ చేసిన ఫొటోకు ఆసక్తికరమైన క్యాప్షన్‌ని జత చేసింది. అయితే రాశి మాస్కోకి ఎందుకు వెళ్లింది? అక్కడ తను ఏం చేస్తోంది?  ప్రత్యేకంగా వెకేషన్ కి వెళ్లిందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాశీ ఖన్నా ప్రస్తుతం హీరో నాగచైతన్య చేస్తున్న `థాంక్యూ` చిత్రంలో నటిస్తోంది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ మాస్కోలో జరుగుతోంది.    

అక్కడి చారిత్రక కట్టడాల మధ్య వున్న అందమైన వీధుల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రకాష్ రాజ్ తో పాటు కీలక నటీనటులపై ప్రధాన ఘట్టాలని దర్శకుడు విక్రమ్ కె. కుమార్ చిత్రీకరిస్తున్నారట. వీరితో పాటు ఈ సన్నివేశాల్లో హీరో నాగచైతన్య రాశిఖన్నా కూడా పాల్గొంటున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే లవ్ స్టోరీ బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ లని సొంతం చేసుకున్న నాగచైతన్య `థాంక్యూ`తో హ్యాట్రిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారట