బండ్ల గణేష్ దృష్టిలో డాలర్ శేషాద్రి ఎవరు..?

Sat Mar 18 2023 16:06:57 GMT+0530 (India Standard Time)

bandla ganesh tweet viral

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అమితమైన అభిమానం కలిగిన బండ్ల గణేష్ ఈమధ్య ఆయనకు దూరంగా ఉంటున్నాడు. పవన్ ని తన దేవుడిగా భావించే బండ్ల గణేష్ లో ఈ సడెన్ ఛేంజ్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. పవన్ కి దగ్గరవ్వాలనే ఆలోచన ఉన్నా మధ్యలో అడ్డుగా త్రివిక్రమ్ ఉన్నాడని ఇన్ డైరెక్ట్ గా.. డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. లేటెస్ట్ గా పవన్ అభిమాని ఒకరు బండ్ల గణేష్ కి స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. నువ్వు పవన్ కి దగ్గరగా ఉండాలని.. ఆయన్ని వదలొద్దని అన్నాడు. దానికి రిప్లై గా మన దేవుడు మంచివాడు డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం.. ఏం చేద్దాం బ్రదర్ అంటూ కామెంట్ పెట్టాడు.ఇంతకీ బండ్ల గణేష్ డాలర్ శేషాద్రి అన్నది ఎవరిని అన్నదంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. తను అన్నది ఎవరినో తనకొక స్పష్టత ఉంది. కానీ ఇన్ డైరెక్ట్ గా త్రివిక్రమ్ మీద ఇలా తన పంచులతో ఎటాక్ చేస్తున్నాడు బండ్ల గణేష్. ఇంతకీ అసలు బండ్ల గణేష్ కి త్రివిక్రమ్ అంటే ఎందుకు పడట్లేదు.. వారిద్దరి మధ్య మ్యాటర్ ఎక్కడ చెడింది అన్నది తెలియాల్సి ఉంది.

పవన్ కి దగ్గరవ్వాలని బండ్ల గణేష్ అనుకుంటుంటే త్రివిక్రమ్ మాటలు విని అతన్ని దూరం పెడుతున్నారట. అందుకే త్రివిక్రమ్ మీద పంచులు వేస్తూ బండ్ల గణేష్ ఇలా తన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. అయితే బండ్ల గణేష్ మాటలను త్రివిక్రమ్ గానీ పవన్ గానీ ఏమేరకు పరిగణలోకి తీసుకుంటారు అన్నది ఆలోచించాల్సి ఉంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ తో మరో సినిమా నిర్మించాలని చూస్తున్న బండ్ల గణేష్ కి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. దానికి ప్రధాన కారణం కూడా త్రివిక్రమ్ అని అంటున్నారు.

పవన్ సినిమా అంటే త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ కంపల్సరీ.. పవన్ ప్రస్తుతం చేస్తున్న రీమేక్ సినిమాలు డైరెక్ట్ సినిమాలన్నిటిలో త్రివిక్రమ్ హ్యాండ్ ఎక్కువగా ఉంటుంది. పవన్ కి బండ్ల గణేష్ కి అడ్డుగా ఉన్న త్రివిక్రమ్ మీద బండ్ల గణేష్ అడపాదడపా ఇలా పంచులు వేస్తూ తన ఫీలింగ్స్ ని బయట పెడుతున్నాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.