Begin typing your search above and press return to search.

బాలయ్య ఫ్యాన్స్.. సిద్దంగా ఉండండి!

By:  Tupaki Desk   |   20 March 2023 9:11 PM GMT
బాలయ్య ఫ్యాన్స్.. సిద్దంగా ఉండండి!
X
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తర్వాత బాలయ్య నుంచి వస్తున్న మూవీ కావడంతో హ్యాట్రిక్ పై కన్నేశారు. సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అని నందమూరి అభిమానులు డిసైడ్ అయిపోయారు.

ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా, శ్రీలీల బాలకృష్ణ కూతురు పాత్రలో నటిస్తుంది. తండ్రి, కూతుళ్ళ అనుబంధం చుట్టూ ఈ మూవీ కథని అనిల్ రావిపూడి ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది.

మార్చి 22న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ ని అనిల్ రావిపూడి రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నాడంట. ఉగాదికి నందమూరి అభిమానులకి బాలయ్యతో ప్రత్యేకంగా విషెస్ చెప్పించే విధంగా ఈ పోస్టర్ ని డిజైన్ చేస్తున్నట్లు టాక్. ఈ లుక్ చాలా ఇంటరెస్టింగ్ గా డిజైన్ చేసినట్లు సమాచారం. కచ్చితంగా నందమూరి అభిమానులని ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది అని భావిస్తున్నట్లు బోగట్టా.

ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి స్టైల్ ఫన్ తో పాటు బాలయ్య నుంచి కోరుకునే పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయని ఇప్పటికే అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. అలాగే తెలంగాణ నేపధ్యంలో బాలయ్య మొదటి సారి పవర్ ఫుల్ డైలాగ్స్ ని ఈ సినిమాలో చెప్పబోతున్నాడు అని కూడా క్లారిటీ ఇచ్చారు. మరి ఉగాదికి బాలయ్య అభిమానులకి ఎలాంటి ఫస్ట్ లుక్ ట్రీట్ ని అనిల్ రావిపూడి ఇస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.