బాలయ్య 108... మరీ ఇంత ఫాస్ట్ ఏంటి రావిపూడి

Tue Jun 28 2022 16:00:01 GMT+0530 (IST)

balakrishna 108 anil ravipudi movie news

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత స్పీడ్ పెంచాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు మీద ఉన్నాడు. ఇప్పటికే బాలయ్య 107 సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతూ ముగింపు దశకు వచ్చింది. ఇదే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదల అయిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.బాలయ్య 107వ సినిమా పట్టాలు ఎక్కక ముందే 108వ సినిమా విషయంలో క్లారిటీ వచ్చింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య 108వ సినిమా రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

మొన్నటి వరకు ఎఫ్ 3 హడావుడిలో ఉన్న అనీల్ రావిపూడి తాజాగా స్క్రిప్ట్ వర్క్ ను మొదలు పెట్టినట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టి కొన్ని వారాలు అయ్యిందో లేదో అప్పుడే స్క్రిప్ట్ రెడీ అయ్యింది అంటూ సన్నిహితుల వద్ద అనిల్ రావిపూడి చెప్పినట్లుగా తెలుస్తోంది. మరీ ఇంత ఫాస్ట్ గా బాలయ్య 108 స్క్రిప్ట్ రెడీ చేశావా అంటూ ఆశ్చర్యపోతున్నారు. రావిపూడి సినిమా మేకింగ్ విషయంలో మరియు స్క్రిప్ట్ కుకింగ్ విషయంలో చాలా ఫాస్ట్ గా ఉంటాడు అనేది అందరికి తెల్సిందే.

బాలయ్య ప్రస్తుతం చేస్తున్న సినిమా ను ముగించిన వెంటనే రావిపూడి సినిమాను పట్టాలు ఎక్కించేందుకు సిద్దంగా ఉన్నాడు. ఎఫ్ 3 సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా వసూళ్లు మాత్రం నిరాశ పర్చాయి. అందుకే ఈ సినిమా ను మరింతగా కమర్షియల్ మూవీగా రూపొందించేందుకు గాను అనిల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

త్వరలో ఈ సినిమాకు నిర్వాత ఎవరు అనే విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమచారాం అందుతోంది.