కాఫీ విత్ కరణ్ అంటేనే సిగ్గుపడుతున్నాడు!

Fri May 13 2022 10:02:18 GMT+0530 (IST)

arjun kapoor comments in koffe with karan show

కొన్ని రోజుల క్రితం కరణ్ జోహార్ తన షో కాఫీ విత్ కరణ్ డిస్నీ+హాట్‌స్టార్ లో సీజన్ 7 ని తిరిగి ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇప్పటికే షో షూటింగ్‌ను ప్రారంభించాడు. ఈ ప్రదర్శనలో కరణ్ అతిథుల జాబితాను రెడీ చేసారు. ఇందులో వివాదాస్పదులు ఉన్నారు. వారి నుంచి రసవంతమైన ప్రకటనలను పిండడానికి ప్రణాళికల్ని సిద్ధం చేసాడు. హోస్ట్ కరణ్ జోహార్ తన చాట్ షో కోసం ఊహించని (కొన్నిసార్లు ఊహించిన) అతిథి జాబితాను సిద్ధం చేయడం తెలిసిందే. సీజన్ 7 ప్రకటించినప్పుడు గెస్ట్ లిస్ట్ గురించి చాలా ఊహాగానాలు వినిపించాయి.ఇంతలోనే కాఫీ విత్ కరణ్ సీజన్ 7: కరణ్ జోహార్ షో నుండి అర్జున్ కపూర్ దూరంగా ఉంటారా? అన్న ప్రశ్నకు సదరు యువహీరో చెప్పిన ఆన్సర్ ఇలా ఉంది. అర్జున్ కపూర్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించినప్పటి నుండి తరచుగా షోలో కనిపిస్తున్నారు. ఈసారి సీజన్ 7 లో కనిపిస్తావా అని ఒక అభిమాని అడిగాడు. మునుపటి సీజన్ లో అర్జున్ తన సవతి సోదరి జాన్వీతో షోలో కనిపించాడు.

జాన్వీ కపూర్ మాయామర్మం తెలియని స్వభావంతో మాట్లాడేస్తూ ఈ షోలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బుధవారం అర్జున్ తన ఇన్ స్టాగ్రామ్ లో AMA సెషన్ ను నిర్వహించారు. అక్కడ ఒక అభిమాని షో సీజన్ 7 గురించి అడిగారు. అతనికి సమాధానం ఇస్తూ.. అర్జున్ తనదైన చమత్కార శైలిలో ``డాక్టర్ ఇటీవల నన్ను కాఫీ తాగమని అడిగారు...`` అని బదులిచ్చారు. చివర్లో వింక్ ఐ ఎమోజీని జోడించి కరణ్ జోహార్ ను ట్యాగ్ చేశాడు.

తరువాత అర్జున్ ఒక కప్పు బ్లాక్ కాఫీ ఫోటోని షేర్ చేసాడు.``అయితే ఇంతకీ ఏమిటంటే.. నేను ప్రతిసారీ డాక్టర్ చెప్పేది వింటాను`` అని మరో వ్యాఖ్యను రాసాడు. దీనిని బట్టి ఈసారి కూడా అర్జున్ మిస్సవ్వడు. అతను షోలో కనిపిస్తానని అధికారికంగా చెప్పేసాడు.

కాఫీ విత్ కరణ్ సీజన్ 7 అర్జున్ కపూర్ కరణ్ జోహార్ షో నుండి దూరంగా ఉండడని ప్రూవ్ అయ్యింది. అన్నట్టు ఈ షోకి అర్జున్ ఒక్కడే వస్తాడా?  లేక ప్రియురాలు మలైకా అరోరాతో దిగిపోతాడా? అన్నది మాత్రం తెలీదు. కేవలం అర్జున్ ఒక్కడినే పిలిచి కరణ్ అన్ని రహస్యాల్ని చెప్పిస్తాడేమో అంటూ అభిమానులు ఊహిస్తున్నారు. కరణ్ తో కాఫీలో కామన్ గా ఉండే ప్రశ్న  మాత్రం మలైకాతో పెళ్లెప్పుడు? దానికి అర్జున్ ఎలాంటి ప్రిపరేషన్ తో వస్తాడో చూడాలి.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అర్జున్ కపూర్ మే 11న చిత్ర పరిశ్రమలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. అతను ఇషాక్ జాదే చిత్రంతో తన అరంగేట్రం చేసాడు. అతను తదుపరి ఏక్ విలన్ రిటర్న్స్ తర్వాత ది లేడీ కిల్లర్ అండ్ కుట్టేలో కనిపించనున్నాడు.