Begin typing your search above and press return to search.
కింగ్ సినిమా కోసం అనుపాప?
By: Tupaki Desk | 5 Feb 2023 4:00 PMకింగ్ నాగార్జున గత ఏడాది ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమా చేశాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ గా మిగిలిపోయింది తప్ప ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. దీంతో నాగార్జున కెరియర్ లో మరో డిజాస్టర్ మూవీగా ది ఘోస్ట్ మిగిలిపోయింది. ఈ సినిమా కాన్సెప్ట్ కామన్ ఆడియన్స్ ని అర్ధం కాకపోవడమే ఫెయిల్యూర్ కి కారణం అని తెలుస్తుంది. ఇక దీని తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నాగార్జున యంగ్ టాలెంటెడ్ రైటర్ కి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు.
సినిమా చూపిస్త మామా, నేను లోకల్, ధమాకా సినిమాతో రైటర్ గా సూపర్ సక్సెస్ అందుకున్న టాలెంటెడ్ యంగ్ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ. ఇతను ఇప్పుడు దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. కింగ్ నాగార్జున ప్రసన్న కుమార్ కి అవకాశం ఇచ్చి దర్శకుడిగా పరిచయం చేయబోతూ ఉండటం ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.ఇక ప్రసన్న కుమార్ రచయితగా చేసిన సినిమాలలో స్క్రీన్ ప్లే తో డైరెక్షన్ పరంగా కూడా మేజర్ సపోర్ట్ ఉంటుంది.
దర్శకుడి పక్కనే ఉండి సినిమా మేకింగ్ లో కూడా అతను భాగం అవుతూ ఉంటాడు. ఈ నేపధ్యంలో నిర్మాతలకి భాగా దగ్గరయ్యాడు. దీంతో ధమాకాని నిర్మించిన నిర్మాత ఇప్పుడు నాగార్జున, ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో మూవీని నిర్మించబోతూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతూ ఉన్నాడు.ఇక సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.
రీసెంట్ గా నానికి జోడీగా ఈ బ్యూటీ రెండో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు నాగార్జునతో మూడో సినిమాని కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ కూడా బయటకి వచ్చింది. యంగ్ టాలెంటెడ్ హీరోయిన్, మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో ఓ ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతుంది అని తెలుస్తుంది. నాగార్జున రికమండ్ చేసి ఆమెని తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఆమె పాత్రలో సినిమాలో ఎలా ఉంటుంది అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.