Begin typing your search above and press return to search.
స్క్రీన్ రైటర్ తో హీరో సిస్టర్ డేటింగ్
By: Tupaki Desk | 28 March 2023 6:00 AMబాలీవుడ్ యువహీరో అర్జున్ కపూర్ .. వయసు తారతమ్యం లేకుండా మలైకా అరోరాఖాన్ తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఈ జంట అధికారికంగా పబ్లిక్ లో షికార్లు చేయడం మీడియాలో నిరంతరం హాట్ టాపిక్. త్వరలోనే ఈ జోడీ పెళ్లికి సిద్ధమవుతున్నారన్న కథనాలు వస్తున్నాయి. ఇంతలోనే అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ తన ప్రియుడిని పరిచయం చేస్తూ ప్రేమను అధికారికం చేశారు.
అగ్ర నిర్మాత బోనీ కపూర్ కుమార్తె .. అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్ తో డేటింగ్ చేస్తున్నట్లు చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. కానీ ఇప్పటివరకూ అధికారికంగా కన్ఫామ్ చేయలేదు. ఇన్ స్టాలో ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించే ఫోటోలను చాలా సార్లు షేర్ చేసినా .. ఇరువైపుల నుండి ఎటువంటి ధృవీకరణ లేదు. కానీ నేటి(27మార్చి) తెల్లవారుజామున రోహన్ తో స్విమ్మింగ్ పూల్ లో రొమాంటిక్ గా ఉన్న ఫోటోని అన్షుల స్వయంగా షేర్ చేయడంతో ఆ ఇద్దరి బంధం అధికారికం అయింది. ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోకి హార్ట్ ఎమోజితో 366 అని అన్షులా క్యాప్షన్ ఇచ్చింది. తను మాల్దీవుల్లోని రిసార్ట్ లొకేషన్ ను ట్యాగ్ చేసింది. అక్కడ తన ప్రియుడు రోహన్ తో డేటింగ్ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఒక ఇన్ఫినిటీ పూల్ లో ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ కనిపిస్తున్న ఫోటో నెటిజనుల్లో వైరల్ అవుతోంది.
ఆథియా శెట్టి- రియా కపూర్- సిద్ధాంత్ కపూర్ వంటి ప్రముఖులు ఈ పోస్ట్ పై వ్యాఖ్యానిస్తూ ముచ్చటైన జంటపై ప్రేమను కురిపించారు. అంతకుముందు రోహన్ తో సెల్ఫీ సహా మాల్దీవుల నుండి కొన్ని పోస్ట్ కార్డ్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.
ప్రేమకు బరువు అడ్డు కాదు!
గతంలో అధిక బరువు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న అన్షులా లుక్ ఇటీవల అమాంతంమారిపోయింది. ఇప్పుడు బరువు తగ్గడంతో గతంలో కంటే ఫిట్ గా కనిపిస్తోంది. ఇటీవల తన ఇన్ స్టా హ్యాండిల్ లో బాడీసూట్ ధరించిన ఫోటోలను షేర్ చేయగా అవి అందరినీ ఆశ్చర్యపరిచాయి. అన్షులా మేకోవర్ ఆకర్షించింది. అదే సమయంలో తాను బాడీ ఇమేజ్ సమస్యలను అధిగమించానని ఆనందంగా తెలిపారు అన్షులా.
కొన్ని సంవత్సరాలుగా బాడీసూట్ లు నా శరీర ఆకృతికి సరిపోవని నాకు నేను అనంతంగా చెప్పుకున్నాను. వేళ్లపై లెక్కించగలిగే దానికంటే ఎక్కువ సార్లు స్విమ్ సూట్లు బాడీ ఫిట్ దుస్తులు ధరించడం మానేశాను. కానీ ఈ సంవత్సరం ప్రారంభంలో నా మారిన ఆకృతిపై నాకు ఒక అవగాహన వచ్చింది. నేను ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించని ప్రతిదాన్ని ప్రయత్నించగలిగాను. దీనిలో చాలా ఆనందం దాగి ఉంది. కనీసం ఒక్కసారైనా నేను ఆ థ్రిల్ ని అనుభవించాలనుకున్నాను! అంటూ ఎమోషనల్ నోట్ ని అన్షులా రాసారు.
నేను బాడీ సూట్ కి సరిపోతానా లేదా? నన్ను ఎవరు పట్టించుకుంటారు!! అనేది నాకు అనవసరం. నేను ఆనందిస్తున్నానా లేదా అంటే.. ఓహ్ 100 శాతం అవును! అని చెబుతాను. నా శరీరంపై స్ట్రెచ్ మార్క్ లు- సెల్యులైట్-టమ్మీ రోల్స్ వంటివి నాలో అభద్రతాభావాన్ని పెంచకుండా ఉండేందుకు నేను ఇంకా నేర్చుకుంటున్నాను. చాలా పద్ధతులను ప్రయత్నిస్తున్నాను. నా ఉంగరాల జుత్తు నాకు ఎంతో ఇష్టం. జీవితంలో ప్రతి నిమిషాన్ని ప్రేమిస్తున్నాను.. అని అన్షుల ఎమోషనల్ అయ్యారు. బోనీకపూర్ శ్రీదేవిని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అంతకుముందే బోనీ మొదటి భార్యకు అర్జున్ కపూర్- అన్షులా కపూర్ జన్మించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.