Begin typing your search above and press return to search.

అమిత్ షా కోసం స్పెషల్‌ స్క్రీనింగ్‌ అంట..

By:  Tupaki Desk   |   25 May 2022 5:30 PM GMT
అమిత్ షా కోసం స్పెషల్‌ స్క్రీనింగ్‌ అంట..
X
అక్షయ్‌ కుమార్‌ హీరోగా సంజయ్ దత్‌.. సోనూ సూద్ కీలక పాత్రల్లో మనుషి చిల్లర్ హీరోయిన్ గా నటించిన 'పృథ్వీరాజ్‌' సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. బాలీవుడ్ యొక్క బాహుబలి అంటూ ఈ సినిమా పై ఉత్తరాది మీడియా భారీ హైప్ క్రియేట్‌ చేసేందుకు పెద్ద ఎత్తున కథనాలు ఇస్తోంది. అక్షయ్‌ కుమార్‌ ఈ సినిమాకు ఖచ్చితంగా ప్రథాన హైలైట్‌ అవుతాడని అంతా బలంగా నమ్ముతున్నారు.

పృథ్వీరాజ్ సినిమా ను జూన్ 3వ తారీకున దేశ వ్యాప్తంగా పలు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరిగాయి. దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమాను చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించాడు. యశ్‌ రాజ్‌ బ్యానర్ లో రాబోతున్న అతి భారీ సినిమా గా ఈ సినిమాకు పేరు దక్కింది. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్ తో పాటు సినిమా కు భారీ క్రేజ్ ఉండటం వల్ల దేశ వ్యాప్తంగా సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈమద్య కాలంలో హిందీ సినిమాలు కమర్షియల్ గా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. ఈ ఏడాదిలో ఏ ఒక్క సినిమా కూడా సాలిడ్ సక్సెస్ ను దక్కించుకున్న దాఖలాలు లేవు. అందుకే తప్పకుండా ఈ సినిమా ఒక మంచి హిట్‌ సినిమా గా నిలుస్తుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ సమయంలో భారీ హైప్‌ క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సినిమా పబ్లిసిటీ లో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కు ఈ సినిమాను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే డేట్ ను కూడా ఖరారు చేయడం జరిగిందట. జూన్‌ 1వ తారీకున ఢిల్లీ లో అమిత్‌ షాకు ప్రత్యేక షో ను వేయబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమాకు ఉన్న హైప్‌ నేపథ్యంలో విదేశాల్లో ప్రీమియర్‌ ల టికెట్లు హాట్‌ కేసుల్లా అమ్మడు పోయాయి.

దేశం లో కూడా పలు రాష్ట్రాల్లో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు అవ్వగా భారీ గానే వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా సినిమా ఒక భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయం అన్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల వారు మరియు ఉత్తరాది ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు. అందుకే పృథ్వీరాజ్ సినిమా కు అడ్వాన్స్ బుకింగ్‌ రికార్డు స్థాయిలో జరుగుతోంది.

300 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన పృథ్వీ రాజ్‌ ను 500 కోట్ల వసూళ్ల టార్గెట్‌ తో విడుదల చేయబోతున్నారు. ఆ స్థాయిలో వసూళ్లను రాబడితేనే హిందీ బాహుబలి అనే ట్యాగ్‌ కు న్యాయం చేసినట్లు అవుతుందని సినీ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక భారీ పౌరాణిక నేపథ్యం సినిమా అయిన ఈ పృథ్వీ రాజ్ ను జనాలు ఎంత వరకు ఆదరిస్తారు అనేది చూడాలి.