Begin typing your search above and press return to search.

టీం కి వార్నింగ్ ఇచ్చిన ఐకాన్ స్టార్..?

By:  Tupaki Desk   |   21 March 2023 8:00 AM GMT
టీం కి వార్నింగ్ ఇచ్చిన ఐకాన్ స్టార్..?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ పక్క పుష్ప సినిమాతో నేషనల్ లెవల్లో సూపర్ పాపులర్ కాగా అక్కడ ఫ్యాన్స్ అంతా కూడా పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు. అందరి అంచనాలను మించి పుష్ప 2 ని ఉంచేలా అల్లు అర్జున్ అండ్ సుకుమార్ తెగ కష్టపడుతున్నారు. అయితే ఇలాంటి టైం లో అల్లు అర్జున్ టీం చేసిన ఓ పనికి అతనికి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. బన్నీతో వరుడు సినిమాలో నటించిన భానుశ్రీ మెహ్రా ట్విట్టర్ అకౌంట్ ని అల్లు అర్జున్ బ్లాక్ చేశాడు. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అల్లు అర్జున్ తో సినిమా చేసిన హీరోయిన్ ని అతను ఎలా బ్లాక్ చేస్తాడని నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేశారు.

అయితే వెంటనే మేల్కొన్న అల్లు అర్జున్ టీం ఆమెను అన్ బ్లాక్ చేశారు. బ్లాక్ చేయడమే తప్పు మళ్లీ ఆమె సోషల్ మీడియాలో అది షేర్ చేయగానే అన్ బ్లాక్ చేసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే అసలు విషయం ఏంటంటే ఈ మ్యాటర్ లో అసలు అల్లు అర్జున్ ఇన్వాల్వ్ మెంట్ లేకపోవడమే. అల్లు అర్జున్ పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. తన ట్విట్టర్ హ్యాండిల్ ని కూడా తన టీం చూసుకుంటుంది. సినిమాలు చేయడం ఎప్పుడో ఆపేసిన భానుశ్రీ మెహ్రా తన వ్లాగ్ నుంచి వరుస పోస్ట్ లు చేస్తుంది.

అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండానే ఆమెని బ్లాక్ చేశారట. ఇక జరిగిన విషయం అంతా తెలుసుకున్న అల్లు అర్జున్ తన టీం కి చీవాట్లు పెట్టినట్టు టాక్. ఒకరిని బ్లాక్ చేయడం ద్వారా నెగటివిటీ వస్తుందని తన టీం కి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడట బన్నీ. స్టార్ హీరో ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూసే ట్రోలర్స్ కి బన్నీ భానుశ్రీని బ్లాక్ చేయడం మళ్లీ అన్ బ్లాక్ చేయడం మంచి స్టఫ్ అయ్యింది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సెలబ్రిటీస్ తమ సోషల్ మీడియా ఖాతాలను ని వారే హ్యాండిల్ చూస్తే బెటర్ అని చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.