Begin typing your search above and press return to search.

ఆదిపురుష్.. పెద్ద మిస్టేక్ చేశారుగా!

By:  Tupaki Desk   |   30 May 2023 6:00 PM GMT
ఆదిపురుష్.. పెద్ద మిస్టేక్ చేశారుగా!
X
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీనే ‘ఆదిపురుష్’. రామాయణం నేపథ్యంతో చెడు మీద మంచి ఎలా గెలిచింది అనే కాన్సెప్టుతో రూపొందిన ఈ సినిమాపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో తీశారు.

హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందిన ‘ఆదిపురుష్’ మూవీని జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో పాటు రెండు పాటలను కూడా విడుదల చేసింది. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ వ్యవహరిస్తోన్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చిన పాటలను లిరికల్ రూపంలో కాకుండా ఫుల్ వీడియోలుగా విడుదల చేశారు. దీంతో ఈ సినిమాలోని చాలా కంటెంట్‌ను ముందే రివీల్ చేసేసినట్లు అయింది.

ముఖ్యంగా గత సోమవారం విడుదలైన ‘రాం సీతా రాం’ పాటలో రామాయణంలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టం సీతా రాములు కలుసుకోవడాన్ని కూడా చూపించారు. ఎంతో భావోద్వేగంతో కూడిన ఈ సన్నివేశాన్ని పాటలోనే చూపించి పెద్ద మిస్టేక్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఇది ముందే చూడడం వల్ల సినిమాలో ఈ సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు పెద్దగా ఫీల్ అయ్యే చాన్స్ ఉండదు. కాబట్టి ఇది చిత్ర యూనిట్ తప్పిదమే అని చెప్పాలి.

సినిమాను జనాలను చేరువ చేయడానికి ‘ఆదిపురుష్’ టీమ్ పాటల రూపంలో సక్సెస్ సాధించింది. కానీ, ఉత్కంఠను రేపే సన్నివేశాలను కూడా ముందే రివీల్ చేయడం వల్ల ఫీల్ మిస్ అయ్యేలా చేసింది. ఇకపై దీని నుంచి వచ్చే అప్‌డేట్ల విషయంలోనైనా ‘ఆదిపురుష్’ టీమ్ కాస్త జాగ్రత్త పడితే మంచిది. లేకుంటే చేచేతులా వాళ్లే కష్టాలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది.