Begin typing your search above and press return to search.

ఎన్నో పోతున్నాయి.. టిక్ టాక్ ఓ లెక్కా!

By:  Tupaki Desk   |   2 July 2020 7:30 AM GMT
ఎన్నో పోతున్నాయి.. టిక్ టాక్ ఓ లెక్కా!
X
ప్రస్తుతం లాక్ డౌన్ టైమ్ కావడంతో సామాన్యులు, సెలబ్రటీలు అనే తేడా లేకుండా అందరికీ బోర్ కొడుతోంది. సెలబ్రిటీల విషయానికొస్తే సోషల్ మీడియాలో వీడియోలు, చిట్ చాట్‌లతో టైంపాస్ చేస్తున్నారు. నటీనటులంతా సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయారు. ఇక తెలుగుతెరకు సీరియల్స్, బిగ్‌బాస్ వంటి కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన హరితేజ. ఈ మధ్య కాలంలో వెండితెర మీద వరుస సినిమాలతో దూసుకుపోతుంది. క్యారెక్టర్ నటిగా బిజీ అయిన హరితేజ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయింది. ఇక తను కూడా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించి తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. ఈ సందర్బంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికతో సమాధానం ఇచ్చింది.

గతంలో సాధారణంగా యాంకర్, నటీమణులకు ఎదురయ్యే ప్రశ్నే హరితేజకు ఎదురైంది. ఓ నెటిజన్ `మీ వయసు ఎంతో చెప్పగలరా?` అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన హరితేజ.. `నేను చెప్పినా మీరు నమ్మరు.. నమ్మినా వినరు.. విన్నా అర్థం చేసుకోరు. నిజాలు ఎప్పుడూ నిష్ఠూరంగా ఉంటాయి అంటూ ఏదో చెప్పేసి ఊరుకుంది. తాజాగా మరోసారి ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగా ఓ నెటిజన్ 'మీ నెంబర్ ఇవ్వండి రోజు మాట్లాడుకోవచ్చు' అని అన్నాడు. దానికి హరితేజ సెటైరికల్‌గా ఓ నవ్వు నవ్వింది. ఇక టిక్ టాక్‌ బ్యాన్‌ పై మీ అభిప్రాయం ఏంటని అడగగా.. 'ప్రస్తుతం ఎన్నో పోతున్నాయి.. వాటిలో టిక్ టాక్ ఓ లెక్కా' అని చెప్పుకొచ్చింది. చివరగా తన బయోపిక్‌కు ఓ టైటిల్ కూడా సజెస్ట్ చేయమని అడిగితే.. భమ్ భమ్ భజూకా అంటూ నవ్వేసింది హరితేజ. ప్రస్తుతం ఈ హరితేజ సమాధానాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.