Begin typing your search above and press return to search.

జాంబి రెడ్డి ద‌స‌రా లుక్.. అసుర సంహారిని ఉగ్ర‌రూపం

By:  Tupaki Desk   |   25 Oct 2020 5:50 AM GMT
జాంబి రెడ్డి ద‌స‌రా లుక్.. అసుర సంహారిని ఉగ్ర‌రూపం
X
జాంబీ మూవీస్ అన‌గానే హాలీవుడ్ లో `రెసిడెంట్ ఈవిల్` సిరీస్ పాపుల‌ర్. చ‌నిపోయిన మ‌నిషి వైర‌స్ రూపంలో జీవించి ప్ర‌పంచ వినాశ‌నానికి దారి తీయ‌డం అన్న కాన్సెప్టుతో ఈ సిరీస్ ర‌క్తి క‌ట్టించింది. త‌మిళంలో జ‌యం ర‌వి న‌టించిన జాంబీ (2019) సౌత్ లో ఓ ప్ర‌యోగం.

ఇప్పుడు తెలుగులో మొట్ట‌మొద‌టి జాంబీ మూవీ అంటూ ప్ర‌యోగం చేస్తున్నారు ప్ర‌శాంత్ వ‌ర్మ.

``# కొరోనా కంటే ప్రమాదకరమైనది.. మన నుండి నరకాన్ని బయటకు తీయడానికి వస్తోంది!`` అంటూ ఇప్ప‌టికే ప్ర‌చారం ప‌రంగా వేడి పెంచారు. జాంబీరెడ్డి తెలుగులో మొదటి జాంబీ చిత్రం! అని చెబుతున్నారు. అ.. క‌ల్కి త‌ర్వాత‌ ప్రశాంత్వర్మ తదుపరి చిత్రం జోంబీ రెడ్డి మ‌రో ప్ర‌యోగమిది. యాపిల్ ట్రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

ఇప్ప‌టికే జాంబీ రెడ్డి ప్ర‌చారం ప‌రంగా ఓ మెట్టు పైనే ఉంది. ఇప్పుడు విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా అమ్మ‌వారి గెట‌ప్ తో క‌థానాయిక రూపాన్ని రివీల్ చేశారు. అసుర సంహారిని లుక్ ఇది. అమ్మ‌వారిగా త్రిశూల‌ధారియై శ‌త్రుసంహారానికి సిద్ధ‌మ‌వుతున్న ఉగ్ర రూపం ఆక‌ట్టుకుంటోంది. ఆనంది (నందిని రెడ్డి) ఈ పాత్ర‌లో న‌టిస్తున్నారు. నేప‌థ్యంలో అమ్మ‌వారి ఉగ్రరూపం భ‌య‌పెట్టేస్తోంది మ‌రి. తేజ స‌జ్జా ఈ చిత్రంలో మేల్ లీడ్ గా నటిస్తున్నారు.