కిస్సులు ప్రాక్టీస్ చేద్దాం రమ్మన్నాడు

Tue Sep 17 2019 07:00:02 GMT+0530 (IST)

Zareen Khan shares shocking revelations on casting couch

కత్రిన డూప్ జరీన్ ఖాన్ గురించి సంగతి తెలిసిందే. కత్రిన తనకు దూరమైన క్రమంలోనే ఈ అమ్మడిని సల్మాన్ భాయ్ తెరపైకి తెచ్చాడు. భాయ్ సరసన వీర్ అనే చిత్రంతో సినీఎంట్రీ ఇచ్చింది. అటుపై `హేట్ స్టోరీ-3`తో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింతగా చేరువైంది. `వీర్` తో పరిచయమైనా జరీన్ కు గుర్తింపును తెచ్చింది మాత్రం `హేట్ స్టోరీ-3`నే. సల్మాన్ ఖాన్ చెప్పడంతో ఆ సినిమాలో నటించిన జరీన్ తాజాగా ఆటంబాంబు లాంటి ఓ సీక్రెట్ మ్యాటర్ ని బయటపెట్టేసింది.  ఓ బాలీవుడ్ హీరోయిన్ కి ఓ ప్రముఖ దర్శకుడు లిప్ లాక్ సీన్ ప్రాక్టీస్ చేద్దామని ప్రపోజ్ చేశాడట. కెరీర్ తొలి నాళ్లలోనే తనకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నేను బాలీవుడ్ కి కొత్త. అయినా ఆ దర్శకుడు చెప్పినట్టుగా రిహార్సల్ చేయడానికి అంగీకరించలేదని వెల్లడించింది.

మరో ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ని ఈ అమ్మడు బయటపెట్టింది. ఇండస్ట్రీలో వున్న కొంత మందితో స్నేహానికి మించి చనువుగా వుంటే సినిమాల్లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటావని బాలీవుడ్‌కు చెందిన ఓ వ్యక్తి  సలహా ఇచ్చారట. ఆ మాటల్ని కూడా తాను పట్టించుకోలేదని.. వారి మాయలో పడకుండా తనని తాను కాపాడుకున్నానని వెల్లడించింది. కత్రినా కైఫ్ తో తనని పోలుస్తూ మీడియా వర్గాలు విమర్శలు కురిపించాయని చెప్పుకొచ్చింది. జరీన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోని చూపిస్తూ నెటిజన్స్ ఇటీవల జరీనాను ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడే నడుము మడతలతో గీతలు పడిపోయాయని హేళన చేశారు. వారికి బుద్ధి చెబుతూ జరీన్ ఖాన్ కౌంటరివ్వగా తనకు అనుష్కశర్మ అండగా నిలిచింది. అన్నట్టు తనని ముద్దుల ప్రాక్టీస్ కి రమ్మన్నది ఎవరు?  ఏ ప్రముఖుడితో చనువుగా ఉంటే ఛాన్సులొస్తాయి అన్నది మాత్రం డీటెయిల్డ్ గా చెప్పనేలేదు. ఇంతకీ ఆ ప్రముఖులు ఎవరై ఉంటారు?