Begin typing your search above and press return to search.

యూత్ స్టార్ నితిన్ కి కొత్త త‌ల‌నొప్పి?

By:  Tupaki Desk   |   25 Jan 2020 1:33 PM GMT
యూత్ స్టార్ నితిన్ కి కొత్త త‌ల‌నొప్పి?
X
యూత్ స్టార్ నితిన్ క‌థానాయ‌కుడిగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న `భీష్మ` రిలీజ్ కు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఫిబ్ర‌వ‌రి 21న రిలీజ‌వుతోంది. ప్రీబిజినెస్ పైనా టీమ్ దృష్టి సారించింది. ఈ సినిమా స‌క్సెస్ పై యూత్ స్టార్ బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్నాడు. శ్రీ‌నివాస క‌ళ్యాణం ఫ్లాప్ తో నిరాశ‌ప‌డ్డ నితిన్ కంబ్యాక్ కోసం ఆస‌క్తిగా వేచి చూస్తున్నాడు. ప్ర‌స్తుతం నితిన్ ఆ టెన్ష‌న్ లోనే ఉన్నాడు. ఈలోగానే నితిన్ కి మ‌రో కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డిందిట‌.

భీష్మ‌ రిలీజ్ హ‌క్కుల విష‌యంలో నిర్మాత దిల్ రాజుకి నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి మ‌ధ్య పోటీ నెల‌కొంద‌న్న వార్త వెడెక్కిస్తోంది. కొన్నాళ్లుగా పంపిణీ బిజినెస్ లో నెమ్మ‌దిగా ఉన్న సుధాక‌ర్ రెడ్డి మ‌ళ్లీ ఊపందుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా భీష్మ వైజాగ్ రైట్స్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారుట‌. దీంతో రెగ్యుల‌ర్ గా వైజాగ్ నైజాం ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేసే రాజుగారికి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలేలా ఉంద‌న్న వార్త హాట్ టాపిక్ గా మారింది. రెండు ఏరియాలు క‌లిపి దిల్ రాజు సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో ఎనిమిదిన్న కోట్ల‌కు డీల్ సెట్ చేసుకునేందుకు చూస్తున్నారుట‌. అయితే చిత్ర‌ నిర్మాత‌లు వైజాగ్ వ‌దిలేసి నైజాం ఏరియా ఆరున్న‌ర కోట్ల‌కు తీసుకోమ‌ని ఆఫ‌ర్ చేస్తున్నారుట‌. వైజాగ్ ఏరియా సుధాక‌ర్ రెడ్డికి ఇచ్చే ప్లాన్ చేయ‌డంతో చిక్కొచ్చి ప‌డింద‌ట‌.

నితిన్ హీరో కాబ‌ట్టి.. ఆయ‌న డాడ్ సుధాక‌ర్ రెడ్డి మాట తీసేయ‌లేక రాజుగారిని స్కిప్ చేస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే ఇంకా ఏది ఫైన‌ల్ కాలేద‌ని...ఇది ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంద‌ని అంటున్నారు. అయితే ఈ వ్య‌వ‌హారం మొత్తం నితిన్ కే త‌ల‌నొప్పిగా మారుతోంది అన్న వార్త వినిపిస్తోంది. గ‌తంలో దిల్ రాజు-సుధాక‌ర్ రెడ్డి మ‌ధ్య‌ మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్తాయ‌న్న చ‌ర్చా సాగింది. అవ‌న్నీ తొల‌గిపోవ‌డానికి కొన్ని సంవ‌త్స‌రాలు ప‌ట్టింది. ఆ త‌ర్వాతే నితిన్ రాజుగారి బ్యాన‌ర్ లో శ్రీనివాస క‌ళ్యాణం సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా రైట్స్ మ్యాట‌ర్ లో ఇద్ద‌రి మ‌ధ్యా పోటీ నెల‌కొన‌డం పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.