Begin typing your search above and press return to search.

భారీ యాక్షన్‌ కోసం యూరప్‌ వెళ్లబోతున్న యంగ్‌ హీరో

By:  Tupaki Desk   |   5 Dec 2022 5:32 AM GMT
భారీ యాక్షన్‌ కోసం యూరప్‌ వెళ్లబోతున్న యంగ్‌ హీరో
X
కార్తికేయ 2 సినిమా తో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యంగ్‌ హీరో నిఖిల్ త్వరలో 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తికేయ 2 సినిమా ఇచ్చిన సక్సెస్‌ జోష్ లో ఉన్న నిఖిల్‌ తన కొత్త సినిమా స్పై కోసం కాస్త ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడని.. ఎక్కువ కష్టపడేందుకు సిద్ధం అయ్యాడని తెలుస్తోంది.

ఇప్పటికే విడుదల అయిన స్పై సినిమా యొక్క గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేసే విధంగా యూనివర్శిల్ సబ్జెక్ట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లోని భారీ యాక్షన్‌ సన్నివేశాల కోసం యూరప్ కు నిఖిల్‌ ఇంకా ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు వెళ్లబోతున్నారు. అక్కడ అత్యంత ఖరీదైన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని.. సినిమాలో ఆ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని చెబుతున్నారు.

నిఖిల్‌ గత చిత్రం కార్తికేయ 2 సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. కనుక ఈ సినిమా టైటిల్‌ చూస్తూ ఉంటే పాన్‌ ఇండియా స్థాయిలో మంచి ఆధరణ దక్కించుకునే విధంగా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీస్తే కచ్చితంగా ఈ సినిమాను కూడా హిందీ ప్రేక్షకులు ఆదరించే అవకాశం పుష్కలంగా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.