కేజీఎఫ్ టీమ్ పార్టీలో యంగ్ టైగర్

Tue Oct 08 2019 11:35:06 GMT+0530 (IST)

Young Tiger at KGF Team Party

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన కన్నడ చిత్రం `కేజీఎఫ్` దేశ వ్యాప్తంగా ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. హీరో యష్ ని.. పాన్ ఇండియా స్టార్ ని చేయడమే కాకుండా కన్నడ సినిమాకు దేశ వ్యాప్తంగా మరింత క్రేజ్ ని.. గౌరవాన్ని తెచ్చిపెట్టింది. కన్నడతో పాటు తెలుగు- తమిళ- హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి రెండవ పార్ట్ పై మరింత క్రేజ్ ని క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్ తొలి భాగం భారీ హిట్ కావడంతో పార్ట్ 2 ని మరింత పగడ్బందీగా తెరపైకి తీసుకొస్తున్నారు.కథకు కీలకమైన విలన్ అధీరా పాత్ర కోసం బాలీవుడ్ బ్యాడ్ మాన్ సంజయ్ దత్ ని తీసుకోవడంతో పార్ట్ 2 పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇటీవలే పార్ట్ 2 కు సంబంధించిన కీలక షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. కీలక ఘట్టాల్ని ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. టీమ్ మొత్తం హైదరాబాద్ లోనే వుండటంతో ఈ చిత్ర యూనిట్ కి తెలుగు హీరో ఎన్టీఆర్ దసరా పార్టీని అరేంజ్ చేసినట్టు తెలిసింది. హీరో యష్- సంజయ్‌దత్- దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఎన్టీఆర్ ఫ్యామిలీ ప్రత్యేక విందుకు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ విందులో ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతితో పాటు కీలక కుటుంబ సభ్యులు పాల్గొంటారట.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. దీన్ని `కేజీఎఫ్-2` రిలీజ్ తరువాత పట్టాలెక్కిస్తారట. టెర్రిఫిర్ స్టోరీ లైన్ తో ఈ సినిమా తెరపైకి రానుందని ఫిల్మ్ సర్కిల్స్ టాక్.