Begin typing your search above and press return to search.

కేటీఆర్ గుడ్ బుక్స్ లోకి టాలీవుడ్ హీరోలు

By:  Tupaki Desk   |   29 Jan 2023 12:48 PM GMT
కేటీఆర్ గుడ్ బుక్స్ లోకి టాలీవుడ్ హీరోలు
X
హైద‌రాబాద్ లో ఫార్ములాE రేసింగ్ పైనా- KTRBRS పైనా యువ‌హీరోల పొగడ్త‌లు అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. దేశంలోనే ఇలాంటి ప్ర‌య‌త్నం మొద‌టి సారి.. ఈ త‌ర‌హా గ‌ట్స్ మంత్రి కేటీఆర్ కి మాత్ర‌మే ఉన్నాయంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తెలంగాణ స‌హా హైద‌రాబాద్ అభివృద్ధిని మ‌రో మెట్టు ఎక్కించేందుకు సూప‌ర్ సోనిక్ వేగంతో దూసుకుపోయేందుకు అవ‌స‌ర‌మైన భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ చిట్కాల‌ను ఆలోచ‌న‌ల‌ను మీడియా స‌హా ఐఐటీ విద్యార్థుల‌తో పంచుకున్న కేటీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఇందులో ఫార్ములా -ఇ రేసింగ్ పైనా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కేటీఆర్ - కేసీఆర్ ప్ర‌భుత్వం చేస్తున్న ఈ ప్ర‌య‌త్నాన్ని ప‌లువురు సినీప్ర‌ముఖులు అభినందించారు.

యువ‌హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫార్ములా ఈ రేసింగుపై ప్ర‌స్థావిస్తూ ట్వీట్ చేసారు. ``మొట్టమొదటిసారిగా, #FormulaE భారతదేశంలోని అత్యంత పచ్చని నగరానికి #GreenkoHyderabadEPrix పేరుతో వ‌స్తోంది..ధన్యవాదాలు మంత్రి కేటీఆర్ గారు. #భారతదేశాన్ని ప్రపంచ పటంలో ప్ర‌త్యేకంగా ఉంచినందుకు ధ‌న్య‌వాదాలు. ఫిబ్రవరి 11 @AceNxtGen..`` అంటూ దేవ‌ర‌కొండ ట్వీట్ చేసారు.

``భారతదేశంలో రేసింగ్ అనేది మొద‌టి ప్ర‌య‌త్నం. ఇది చాలా థ్రిల్లింగ్ గా ఉందని మ‌రో యువ న‌టుడు న‌వీన్ పోలిశెట్టి అన్నారు. FIAFormulaE భారతదేశంలోని హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. దీనికోసం గ్రీన్ హైద‌రాబాద్ ఈప్రిక్స్ ప్ర‌ణాళిక‌ల్లో ఉంది. న‌రాల్లో విద్యుత్ శ‌క్తి ప్ర‌వ‌హించేంత ఉద్విగ్నంగా ఉంది. ఇంకా వేచి ఉండలేను..`` అని న‌వీన్ పోలిశెట్టి ఎగ్జ‌యిట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా KTRBRS కి ధన్యవాదాలు తెలిపారు. హైద‌రాబాద్ కి ఇలాంటి చక్కని కీర్తిని తీసుకొచ్చినందుకు తెలంగాణ సీఎంఓకి థాంక్స్ చెప్పారు. దేవ‌ర‌కొండ‌- న‌వీన్ పోలిశెట్టి స‌హా ప‌లువురు యువ‌హీరోలు కేటీఆర్ ప్ర‌ణాళిక‌ల‌ను ప్ర‌శంసించారు.