Begin typing your search above and press return to search.

కుర్ర హీరోలు ఓటీటీ ఆఫర్స్ కి 'నో' చెప్పలేకపోతున్నారట...!

By:  Tupaki Desk   |   11 July 2020 12:30 AM GMT
కుర్ర హీరోలు ఓటీటీ ఆఫర్స్ కి నో చెప్పలేకపోతున్నారట...!
X
'ఓటీటీ' అంటే 'ఓవర్‌ ది టాప్‌'... పేరుకు తగ్గట్టుగానే దానిదే ఇప్పుడు పైచేయి అవుతోంది. కరోనా పుణ్యమా అని జనాలు ఇళ్లకే పరిమితం అయ్యాక ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఓటీటీలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరగడంతో పాటు భారీ వ్యూయర్ షిప్ కూడా వస్తోంది. దీంతో స్టార్ యాక్టర్స్ ని వెబ్ వరల్డ్ లోకి తీసుకొచ్చి మరింత క్రేజ్ తెచ్చుకోవాలని ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్ ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం ఇప్పటికే బాలీవుడ్ లో కొంతమంది నటీనటులకు ఫ్యాన్సీ రేట్స్ ఆఫర్ చేసి వారిని వెబ్ సిరీస్ లలో నటింపజేస్తున్నారు. ఇప్పుడు ఇత‌ర సినీ ఇండ‌స్ట్రీల మీద ఓటీటీలు ఫోకస్ పెట్టాయట.

ముఖ్యంగా మన టాలీవుడ్ మీద ద్రుష్టి కేంద్రీకరించిన ఓటీటీలు దానిలో భాగంగా ఇక్క‌డ కొంత మంది కుర్ర హీరోలకు గాలం వేస్తున్నారట. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ యువ హీరోలకు భారీగానే రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తున్నారట. ఈ క్రమంలో ఒరిజినల్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లలో యాక్ట్ చేయాల్సిందిగా ఆప్షన్ ఇస్తున్నారట. ఇక ఓటీటీలు ఇచ్చే క్రేజీ ఆఫర్స్ కి కుర్ర హీరోలు 'నో' చెప్పలేకపోతున్నారట. అయితే కొంతమంది హీరోలు మాత్రం వెబ్ సిరీస్ లు తెలుగులో ఆదరణ తెచ్చుకుంటున్న‌ప్ప‌టికీ అందులో యాక్ట్ చేసే నటీనటులకు ఉప‌యోగపడటం లేదని అంటున్నారట.

ఇక మరికొందరు యంగ్ హీరోలు మాత్రం ఈ ఓటీటీలతో కలిసి ప్రొడక్షన్ లోకి దిగాలని ట్రై చేస్తున్నారట. యువ హీరోలు నాని, విజయ్ దేవరకొండ, నాగ శౌర్య లాంటి హీరోలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే వీరు సొంతంగా ప్రొడక్షన్ హౌసెస్ స్టార్ట్ చేసి సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వెబ్ వరల్డ్ లో కూడా అడుగుపెట్టి వెబ్ సిరీస్ అండ్ ఒరిజినల్ మూవీస్ నిర్మించే ఆలోచన చేస్తున్నారట. ఫ్యూచర్ లో ఓటీటీలదే రాజ్యం కాబోతోందని అంటున్న తరుణంలో మన హీరోలు అక్కడ కూడా సక్సెస్ అవుతారేమో చూడాలి.