Begin typing your search above and press return to search.

యంగ్ హీరోకి ఇక అన్ని మంచి రోజులే!

By:  Tupaki Desk   |   9 Dec 2021 2:30 AM GMT
యంగ్ హీరోకి ఇక అన్ని మంచి రోజులే!
X
యంగ్ హీరో సంతోష్ శోభ‌న్ ఇటీవ‌లే `మంచి రోజులు వ‌చ్చాయి` చిత్రంతో స‌క్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యం సాధించింది. `పేప‌ర్ బోయ్`..`ఏక్ మినీ క‌థ` చిత్రాల‌తో న‌టుడిగా ప్రూవ్ చేసుకున్న సంతోష్ `మంచి రోజులు వ‌చ్చాయి`తో క‌మ‌ర్శియ‌ల్ హీరోగాను ట్రాక్ లోకి వ‌చ్చాడు. ప్ర‌స్తుతం యంగ్ హీరో లైన‌ప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.

ఒక సినిమా సెట్స్ లో ఉండ‌గానే మ‌రో చిత్రంలో ఛాన్స్ అందుకుంటున్నాడు. ప్ర‌స్తుతం నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `అన్ని మంచిశ‌కునాలే` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇది రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్.

`ఓ బేబి` స‌క్సెస్ త‌ర్వాత నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం కావ‌డం విశేషం. టాలీవుడ్ లేడీ ద‌ర్శ‌కుల్లో ఆమె ట్రాక్ రికార్డు కూడా బాగానే ఉంది. ఈనేప‌థ్యంలో యంగ్ హీరోపై అంచ‌నాలు నెల‌కొంటున్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. తాజాగా శోభ‌న్ మ‌రో చిత్రానికి సైన్ చేసాడు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాకు క‌మిట్ అయ్యాడు.

ఇందులో `జాతిర‌త్నాలు` ఫేం ఫ‌రియా అబ్ధుల్లా హీరోయిన్ గా ఎంపికైంది. ఇది కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. ప‌క్కా గాంధీ మార్క్ చిత్రంగా తెలుస్తుంది. నిహారిక ఎంట‌ర్ టైన్ మెంట్స్ చిత్రాన్ని నిర్మించ‌నుంది. వ‌చ్చే ఏడాది సినిమా ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌నుంది.

2022 మిడ్ క‌ల్లా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈరెండు మ‌రో నాలుగు చిత్రాల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. యంగ్ మేక‌ర్స్ యువ హీరోతో సినిమాలు చేయ‌డానికి అమితాస‌క్తి చూపిస్తున్నారు.

ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాల హీరో కాబ‌ట్టి వ‌రుణ్ సందేశ్ లా మార్కెట్ ని బిల్డ్ చేసుకునే అవ‌కాశం ఉంది. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండ‌క‌పోతే ఎలా ఉంటుంది? అన‌డానికి కింద‌కి ప‌డిపోయిన ఎంతో మంది యువ హీరోల్ని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు.