తెలుగు సోడా తుస్సుమంది

Sat May 25 2019 10:56:41 GMT+0530 (IST)

Yevadu Takkuva Kadu Gets Flop Talk At Box Office

నిన్న సీతతో పాటు ఇంకొన్ని తెలుగు సినిమాలు విడుదలయ్యాయి కాని వాటి తాలుకు పబ్లిసిటీ మరీ కనీస స్థాయిలో లేకపోవడంతో జనానికి వచ్చిన సంగతి కూడా తెలియకుండా పోయింది. వాటిలో ఎవడు తక్కువ కాదు ఒకటి. నిర్మాత లగడపాటి శ్రీధర్ అబ్బాయి విక్రమ్ సహిదేవ్ ని హీరోగా పరిచయం చేస్తూ కన్నడ నుంచి డబ్ చేసిన ఈ మూవీ తమిళ్ బ్లాక్ బస్టర్ గోలి సోడాకి అఫీషియల్ రీమేక్.ఇక సినిమా విషయానికి వస్తే ఒరిజినల్ స్థాయిలో ఫీల్ కలిగించలేక ఎవడు తక్కువ కాదులో అన్ని తక్కువే అనే అభిప్రాయం కలిగించింది. ముఖ్యంగా తమిళ్ వెర్షన్ లో ఉన్న రానెస్ బోల్డ్ అటెంప్ట్ ని ఇక్కడ రీ క్రియేట్ చేయడంలో దర్శకుడు రఘు జయ తడబడటంతో ఆశించిన అవుట్ ఫుట్ రాలేక తేడా కొట్టేసింది. ఇది నలుగురు అనాథలకు స్థానిక మాఫియా లీడర్ కు జరిగే మైండ్ గేమ్ ఆధారంగా రూపొందింది. తమ గ్యాంగ్ లో అమ్మాయిని దారుణంగా అవమానించిన అతని మీద తమదైన శైలిలో ప్రతీకారం తీర్చుకునే నలుగురు టీనేజ్ కుర్రాళ్ళ జీవన పోరాటమే ఈ ఎవడూ తక్కువ కాదు.

కథలో కంటెంట్ ఉన్నప్పటికీ అది తెరమీదకు సమర్ధవంతంగా రాలేకపోయింది. విక్రమ్ హీరోయిన్ ప్రియాంకా జైన్ తో పాటు ఇంకో లేడీ ఆర్టిస్టు పర్వాలేదు అనిపించినా మిగిలినవాళ్ళ సెలక్షన్ రాంగ్ గా ఉండటంతో అవుట్ ఫుట్ వీకైపోయింది. మొత్తానికి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెళ్లిపోయేలా ఉన్న ఎవడూ తక్కువ కాదు విక్రమ్ సహిదేవ్ కు ఆశించిన డెబ్యూ కాలేకపోయింది. విచిత్రంగా ఏడాది పాత సినిమా అయినా నా పేరు సూర్య కన్నా ఇందులోనే విక్రమ్ లేతగా కనిపించడాన్ని బట్టి ఇది మరీ కొత్తది కాదనే విషయం అర్థమవుతోందిగా