Begin typing your search above and press return to search.

సలార్ లో యశ్ .. ఇక గూస్ బంప్సే

By:  Tupaki Desk   |   26 Jan 2023 10:25 AM GMT
సలార్ లో యశ్ .. ఇక గూస్ బంప్సే
X
కేజిఎఫ్ సిరిస్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో హీరోగా యశ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలతో అతనికి తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ పలు భాషల్లో ఫ్యాన్స్ ఏర్పడ్డారు. కేజిఎఫ్ సినిమాల తర్వాత యశ్ ఇప్పటివరకు సినిమాను అనౌన్స్ చేయలేదు. కేజిఎఫ్ 2 కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.

ఈ విజయంతో యశ్ కి భారీగా డిమాండ్ ఏర్పడింది. అతని నెక్స్ట్ సినిమాపై దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్ కు కొనసాగింపుగా కేజిఎఫ్ 3 ఉంటుందని... త్వరలో కేజీఎఫ్ 3ను కూడా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూడో భాగం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియని పరిస్థితి.

ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత నీల్ ప్రభాస్ తో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా గ్యాంగ్ స్టర్, యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. ప్రభాస్ పై హై ఇంటెన్ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ప్రభాస్ ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి. కాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

సలార్ లో యశ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఇక అటు ప్రభాస్, యశ్ ఫ్యాన్స్ కు పండుగ అని చెప్పవచ్చు.

ఇక ఈ సలార్ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుండగా... జగపతిబాబు, పృధ్విరాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. కేజిఎఫ్ సినిమాలను తెరకెక్కించిన హాంబలే ఫిలిం అధినేత విజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరెక్కుతోంది. ఇక చూడాలి ఇందులో ఎంత నిజం ఉందో. ఒకే స్క్రీన్ పై ప్రభాస్ యశ్ కనిపిస్తే... ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఖాయం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.