కొత్తాళ్లతో వస్తున్నా.. త్వరలోనే చెబుతా

Fri May 25 2018 05:00:01 GMT+0530 (IST)

YVS Chowdary Coming Back With New Talent

సినిమా రంగంలో ఏది పెర్మనెంట్ కాదు. కొన్నిసార్లు 10 సినిమాలు చేస్తే ఒకటి హిట్ అవ్వచ్చు కొన్నిసార్లు మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అయిపోవచ్చు. మొదట్లో కొన్ని హిట్లు పడినప్పటికీ వరుస ప్లాపులతో కెరీర్ లో బాగా డౌన్ అయిపోయిన దర్శకుడు ఇప్పుడు కొత్తవాళ్ళతో సినిమా తీయడానికి సిద్ధమయ్యాడట. అతను ఎవరో కాదు వైవిఎస్ చౌదరి.ఒకప్పుడు వైవిఎస్ చౌదరి పెరు టాలీవుడ్ దర్శకుల లిస్టులో మొదటి పేజీలోనే ఉండేది. కాకపోతే ఈ మధ్య ఒక్క హిట్ సినిమా కూడా లేకపోవడం వల్ల ఆయన పేరు మర్చిపోయారు ప్రేక్షకులు. గతంలో ఆయన చేసిన లాహిరి లాహిరి లాహిరిలో - దేవదాస్ సినిమాలు చాలా బాగా ఆడాయి. కానీ తరువాత ఒక్క సినిమా కూడా కనీసం హిట్ టాక్ సంపాదించిన పాపాన పోలేదు. సలీం - ఒక్క మగాడు లాంటి డిసాస్టర్లు సగం స్టార్ డమ్ ను పాడుచేయగా.. రేయ్ సినిమా వల్ల పూర్తిగా డౌన్ అయిపోయాడు వైవిఎస్.

ఇప్పుడు మళ్ళి తన సత్తా చాటడానికి ముందుకు వస్తున్నట్టు తెలిపారు. నిన్న వైవిఎస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మీడియా తో ముచ్చటిస్తూ తను మళ్ళీ ఒక సినిమాతో మన ముందుకు రాబోతున్నట్టు చెప్పారు. అంతే కాదు అందులో అందరూ కొత్తవాళ్లనే తీసుకోవాలని ప్లాన్ అంట. మరికొన్ని విషయాలు త్వరలోనే చెబుతా అంటున్నాడు చౌదరి.