Begin typing your search above and press return to search.

నిర్మాతలను లాభాల్లోకి నెట్టిన 'రైటర్ పద్మభూషన్'

By:  Tupaki Desk   |   7 Feb 2023 9:21 AM GMT
నిర్మాతలను లాభాల్లోకి నెట్టిన రైటర్ పద్మభూషన్
X
టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రైటర్ పద్మభూషన్. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి.. గత శుక్రవారం విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ సొంతం తేసుకుంది. దీనితో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా... ఈ చిత్రం యూఎస్ఏలోనూ సాలిడ్ వసూళ్లను సాధిస్తోంది.

కొత్త దర్శకుడు షణ్మఖ్ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. అయ్తితే ఈ సినిమా బడ్జెట్ 4 కోట్ల రూపాయలు. మొదటి వారంతంలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ చిత్రం ఓవర్సిస్ లో ఇప్పటివరకు $200K వసూలు చేసింది. ట్రెండ్‌ని బట్టి చూస్తే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా లాంగ్ రన్ ఉంటుందని తెలుస్తోంది.

ఆకట్టుకునే కథ, కథనాలతో హృద్యమైన ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ విడుదలైన అన్ని ప్రాంతాల ఆడియన్స్ ని అలరిస్తూ ప్రస్తుతం మంచి కలెక్షన్ తో దూసుకెళుతోంది. రూ. 4 కోట్ల బడ్జెట్‌తో (ప్రింట్‌లు, పబ్లిసిటీతో సహా) రూపొందించబడిన ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ నెట్‌వర్క్ ప్రీ-రిలీజ్ ధరకు విక్రయించింది. ఇక ఇప్పటికే నిర్మాతలను లాభాల్లోకి నెట్టిందని తెలుస్తోంది. ఇక పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోన్న ఈ సినిమా ఇంకా కొన్ని రోజులు థియేటర్లలో ఆడుతోందని తెలుస్తోంది. దీనితో నిర్మాతలు భారీ లాభాల బాట పట్టినట్లు అర్థం అవుతోంది.

ఇక రైటర్ పద్మభూషణ్‌ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ రైట్స్ కోసం మంచి ఆఫర్లు వస్తున్నాయి. చై బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో సుహాస్ కు జోడీగా టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా చేశారు. రోహిణి, ఆశిష్ విద్యార్థి, గోపరాజు రమణ వంటి వాళ్లు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.