Begin typing your search above and press return to search.

మహిళలకు రైటర్ పద్మభూషణ్ ఉచిత షోలు

By:  Tupaki Desk   |   7 Feb 2023 2:19 PM GMT
మహిళలకు రైటర్ పద్మభూషణ్ ఉచిత షోలు
X
సుహాస్‌ హీరోగా నటించిన రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు రావడంతో పాటు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ మౌత్ టాక్‌ వచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి.

ఈ సినిమా మరింత భారీ వసూళ్లు నమోదు చేయడం కోసం విభిన్నమైన ప్రమోషనల్‌ వ్యూహాలను చిత్ర యూనిట్‌ సభ్యులు అనుసరిస్తున్నారు. రేపు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన 38 థియేటర్స్‌ లో మహిళలకు పూర్తిగా రైటర్‌ పద్మభూషన్‌ సినిమాను ఉచితంగా ప్రదర్శించబోతున్నారు. ఎంత మంది మహిళలు ఆ షోలకు హాజరు అయినా కూడా ఉచితంగా టికెట్లు ఇవ్వబోతున్నారు.

ఈ విషయాన్ని యాంకర్‌ సుమ అధికారికంగా ప్రకటించారు. రైటర్‌ పద్మభూషన్‌ సినిమాను మహిళల కోసం ఉచితంగా ప్రదర్శించబోతున్నట్లుగా సుమ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసి అందరిని ఆశ్చర్యపర్చింది. సినిమా ప్రమోషనల్‌ వ్యూహాల్లో ఇది ఒక భాగం.

షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను చాయ్‌ బిస్కట్‌ సంస్థతో కలిసి లహరి ఫిల్మ్స్ వారు నిర్మించరు. విడుదలకు ముందు నుండే పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకున్న ఈ సినిమా సెంటిమెంట్‌ పరంగా ప్రేక్షకుల యొక్క అభిమానం సొంతం చేసుకుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.