వరల్డ్ మోస్ట్ క్రేజీ వెబ్ సిరీస్ మళ్లీ రచ్చ

Sun Dec 05 2021 14:00:01 GMT+0530 (IST)

World Most Crazy Web Series is back in business

ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన మనీ హేస్ట్ మళ్లీ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ ను కొన్ని కోట్ల మంది చూశారు.. చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 5 సీజన్ లుగా ఈ వెబ్ సిరీస్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ నుండి 5వ సీజన్ వరకు ప్రతి ఒక్క సీజన్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ లోని పాత్రలతో మరియు సన్నివేశాలతో ప్రేక్షకులు ట్రావెల్ అవుతూ వచ్చారు. ఒక్కో సీజన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. 5వ సీజన్ తో ఈ వెబ్ సిరీస్ ను ముగించాలని భావించారు. కాని 5వ సీజన్ లో మ రో సీజన్ ను తీసుకు వస్తామని మేకర్స్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపర్చారు.ఆమద్య మనీ హేస్ట్ 5వ సీజన్ వచ్చిన సమయంలో ప్రపంచం మొత్తం ఊగి పోయింది. 5.2 సీజన్ వస్తుందని ప్రకటించినప్పటి నుండి కూడా ఎప్పుడెప్పుడా అన్నట్లుగా అంతా ఎదురు చూశారు. నాలుగు నెలలుగా డిసెంబర్ నెల కోసం ఎదురు చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా స్ట్రీమింగ్ మొదలు అయిన మనీ హేస్ట్ వెబ్ సిరీస్ ను ఎప్పటిలాగే విపరీతంగా ఆధరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో సబ్ టైటిల్స్ తో అభిమానులు చూస్తున్నారు. కొన్ని దేశాల్లో ఈ వెబ్ సిరీస్ ను ఆయా దేశాల భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి వరల్డ్ మోస్ట్ క్రేజీ వెబ్ సిరీస్ చాలా ఆసక్తిగా సాగింది. ఈ సీజన్ మొత్తం కూడా ప్రొఫెసర్ చుట్టు తిరిగింది. అతడు బంగారాన్ని సొంతం చేసుకున్నాడా.. పోలీసుల నుండి తనను తాను మరియు తన గ్యాంగ్ ను ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి చెందే విధంగా ఈ వెబ్ సిరీస్ క్లైమాక్స్ ను రూపొందించారు. ఈ సీజన్ లో కూడా ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా చివరి ఎపిసోడ్ లో ప్రొఫెసర్ పాత్ర ను మలిచిన తీరు ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. నెట్ ఫ్లిక్స్ కు ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఖాతాదారులు అయ్యేందుకు గాను ఈ వెబ్ సిరీస్ దోహద పడిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.