వర్కవుట్ సెషన్ ముగిసిన తర్వాత హాట్ బ్యూటీస్ స్పెషల్ ట్రీట్..!

Wed Jun 23 2021 23:00:01 GMT+0530 (IST)

Workout buddies Sara Ali Khan and Janhvi Kapoor

బాలీవుడ్ బ్యూటీస్ సారా అలీ ఖాన్ - జాన్వీ కపూర్ ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఇమేజ్ - క్రేజ్ పెంచుకుంటూ పోతున్నారు ఈ భామలు. ఇదే క్రమంలో అవకాశాలు కూడా అందుకుంటున్నారు. రియల్ లైఫ్ లో స్నేహితులైన వీరిద్దరూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అగ్గి రాజేస్తూ ఉంటారు.ఇటీవల సారా - జాన్వీ కలిసి వర్కవుట్లు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయింది. చెమటలు కక్కిస్తూ కష్టమైన వర్కవుట్లను ఇష్టంగా చేస్తూ కనువిందు చేసారు. ఈ క్రమంలో తాజాగా సారా అలీ ఖాన్ - జాన్వి కపూర్ మరోసారి అభిమానులకు ప్రత్యేక విందు అందించారు. పైలేట్స్ సెషన్ ముగిసిన తర్వాత ఇద్దరూ బయట కనిపించి ఫోటోగ్రాఫర్స్ కు పని కల్పించారు.

ఈ ఫోటోలలో సారా అలీ ఖాన్ బ్లాక్ పైలేట్ గర్ల్ టీ షర్ట్ మరియు దానికి మ్యాచింగ్ అయ్యే షార్ట్ ధరించి కనిపిస్తోంది. మరోవైపు జాన్వీ కపూర్ వైట్ టీ షర్ట్ - గ్రీన్ ప్యాంటుతో సింపుల్ గా కనిపిస్తుంది. స్టైలిష్ బ్యాగ్ లు మోస్తున్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు.. కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించి ఉన్నారు. వ్యాయమ సెషన్ ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో బయలుదేరడం ఈ వీడియోలో కనిపిస్తుంది.

జాన్వీ - సారా మధ్య స్నేహ బంధాన్ని చూసిన వారి అభిమానులు.. ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం సారా అలీఖాన్.. అక్షయ్ కుమార్ - ధనుష్ లతో కలిసి 'అట్రాంగి రే' సినిమాలో నటిస్తోంది. మరోవైపు 'గుడ్ లక్ జెర్రీ' మరియు 'దోస్తానా 2' చిత్రాల్లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ ఇద్దరితో సౌత్ డెబ్యూ చేయించాలని చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి త్వరలోనే ఈ భామల సాత్ ఎంట్రీ ఉంటుందేమో చూడాలి.