పూర్తయ్యే వరకు మీతోనే.. అంటున్న స్టార్ హీరో

Mon May 25 2020 14:40:15 GMT+0530 (IST)

With you till the end of The Shooting the star hero

జూనియర్ ఎన్టీఆర్ - రామ్‌చరణ్ కథానాయకులుగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా పై అంచనాలు మాత్రం మాములుగా లేవు. చారిత్రాత్మక కథల నేపథ్యంలో బ్రిటిష్ కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో రెండు వైవిధ్యమైన షేడ్స్‌ను కలిగి ఉన్న పాత్రలో కనిపిస్తాడని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఎన్టీఆర్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేయగా మూడో షెడ్యూల్ కోసం ఇంకాస్త బాడీ పెంచే పనిలో పడ్డాడట. చారిత్రాత్మక సినిమాల విషయంలో గాని వాటి పాత్రల విషయంలో రాజమౌళి అస్సలు రాజీపడరు.కానీ ఎన్టీఆర్‌ను సరికొత్తగా చూపించేందుకు మాత్రం గట్టిగా ట్రై చేస్తున్నాడని సమాచారం. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిపేసి ఇళ్లకే పరిమితమయ్యారు రాజమౌళి టీమ్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ప్రతినాయకుడి ఛాయలు కనిపిస్తాయని తను అడవి దొంగగా కనిపించబోతున్నాడని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ సాధారణంగా ఇంకొన్ని సన్నివేశాల్లో కండలు తిరిగిన దేహంతో ఉంటారట. అందుకోసం ఎన్టీఆర్ తన బాడీని మేకోవర్ చేసే పనిలో ఉన్నారట. ‘అరవింద సమేత’లో సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనమిచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఇంకో మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. దాదాపు రెండేళ్లుగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కే పరిమితం అయిపోయాడు.  

అసలు ఎప్పుడో షూటింగ్ ముగియాల్సిన ప్రాజెక్ట్ లాక్ డౌన్ వలన ఆగిపోయింది. కానీ త్వరలోనే వర్క్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇక ఆర్ఆర్ఆర్ లైన్లో ఉండగానే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కొత్త సినిమా ఓకే చేసాడు. ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ కావాల్సింది.. కానీ కుదరలేదు. ఇక త్వరలో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కానీ ఓ బ్యాడ్ న్యూస్ ఫర్ త్రివిక్రమ్ టీమ్. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ కోసమే ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యే వరకు నిద్రపోను.. అన్నట్లు ఆర్ఆర్ఆర్ కోసం మొత్తం కాల్ షీట్స్ కేటాయించేసాడట. మరి త్రివిక్రమ్ తో సినిమా దాదాపు నెక్స్ట్ ఇయర్ ప్రారంభంలో ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీ టాక్.