అదే జరిగితే ప్రభాస్ అరుదైన ఘనతని సాధిస్తాడా?

Mon Sep 26 2022 14:02:58 GMT+0530 (India Standard Time)

With Adipurush Film Will Prabhas Break the Records

జక్కన్న అత్యంత సాహసోపేతంగా తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్ సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ఈ రెండు సినిమాలతో ప్రభాస్ పేరు పతాక స్థాయిలో మారు మోగింది. అయితే ఆ తరువాత చేసిన సినిమాలు ప్రభాస్ కు ఆ స్థాయి సక్సెస్ లని అందించేలకపోయాయి. దీంతో ఇప్పడు అందరి దృష్టి 'ఆదిపురుష్' పై పడింది. యావత్ దేశం మొత్తం ఈ మూవీ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీ ఇది. అంతే కాకుండా శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్న ఈ మూవీ కావడం.. ఇప్పటి వరకు ఈ కథ నేపథ్యంలో ఎన్నె సినిమాలు వెండితెరపై అద్భుత దృశ్య కావ్యాలుగా నిలిచి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే అలాంటి కథని ఓం రౌత్ కొత్త పంథాలో ఏవిధంగా ఆవిష్కరించబోతున్నాడన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా ప్రభాస్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ కూడా ఇదే.

దీంతో ఈ మూవీతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై వున్న అపోహలు కూడా తేలిపోనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన టీజర్ ని ఫస్ట్ లుర్ పోస్టర్ ని అక్టోబర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం రాముడు జన్మించిన రామజన్మభూమి అయోధ్యని వేదికగా ఎంచుకున్నారు. టెంపుల్ సిటీలో ప్రస్తుతం దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ పర్యటిస్తున్నారట.

అక్కడే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి యావత్ దేశం మొత్తం ఈ మూవీపై అటెన్షన్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. దేశంలో ప్రస్తుతం రీజినల్ ఫీలింగ్స్ పీక్స్ కి చేరిన నేపథ్యంలో 'ఆది పురుష్' సంచలనం సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతే కాకుండా ఈ మూవీతో బాలీవుడ్ గత కొంత కాలంగా ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులకు ప్రభాస్ చెక్ పెట్టడం ఖాయనిఅంతే కాకుండా రాముడి పాత్రలో ప్రభాస్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాడని అంటున్నారు.

అదే జరిగితే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై నెలకొన్న భ్రమలతో పాటు హీరోగా ప్రభాస్ బిగ్గెస్ట్ ఐకాన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా నిలిచి అరుదైన ఘనతని సాధించడం ఖాయం అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ప్రభాస్ తన తదుపరి మూవీని దర్శకుడు మారుతితో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే సైలెంట్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరపైకి రానున్న ఈ మూవీకి సంబంధించిన తాజాగా ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.

థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ మూవీలోని కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించే అవకాశం వుందని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించనున్నారట. సంజయ్ దత్ ఇటీవల 'కేజీఎఫ్ 2'లో అధీరాగా నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.