పైడిపల్లి ఆశలకు ఆ ఇద్దరూ చెక్ పెట్టేస్తారా?

Sun Nov 22 2020 20:20:41 GMT+0530 (IST)

Will those two check Paidipally's hopes?

సూపర్ స్టార్ మహేష్ కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీ మహర్షికి దర్శకత్వం వహించారు పైడిపల్లి. ఆ మూవీ కోసం ఏకంగా మూడేళ్లు కేటాయించిన దర్శకుడిగా పైడిపల్లి హార్డ్ వర్క్ ని కమిట్ మెంట్ ని మహేష్ ఎంతగానో ప్రశంసించారు. మహర్షి తర్వాత మరో సినిమా చేస్తానని కూడా మాటిచ్చారు.కానీ అనూహ్య పరిణామాల నడుమ మహేష్ ఆ ప్రాజెక్టును తిరస్కరించారు. స్క్రిప్టు పరంగా మహేష్ ని ఒప్పించడంలో పైడిపల్లి తడబడ్డారు. దీంతో ఆ ఆఫర్ కాస్తా పరశురామ్ కి వెళ్లిపోయింది. ప్రస్తుతం పరశురామ్ తో సర్కార్ వారి పాట లాంచ్ చేశారు. జనవరి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ సాగనుంది. ఈ సినిమాని 2021లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ మూవీ తర్వాత మహేష్ ఎవరితో పని చేస్తారు? అన్నదానికి ఇప్పటికీ క్లారిటీ లేదు.

అయితే ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పటికే మహేష్ కోసం స్క్రిప్టు రెడీ చేశారని .. ఛత్రపతి శివాజీ జీవితకథతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని వార్తలొస్తున్నాయి. దీంతో పాటు త్రివిక్రమ్ కూడా మహేష్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తుండడంతో అది కూడా ఖాయమైనట్టేనని చెబుతున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ కి స్కోప్ ఉండే వీలుందన్న గుసగుసలు ఇదివరకూ వినిపించాయి. ఇంత కాంపిటీషన్ నడుమ వంశీ పైడిపల్లి మరో కొత్త స్క్రిప్టు వినిపించి మహేష్ ని స్పెల్ బౌండ్ చేస్తారా? అన్నది వేచి చూడాలి. కథ కంటెంట్ విషయంలో ప్రతిదీ ఆచితూచి అడుగులు వేసే మహేష్ ఈసారి ఎవరిక ఛాన్సిస్తున్నారు? అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. రాజమౌళితో త్రివిక్రమ్ తో సినిమాల్ని ఖాయం చేసుకుంటారా?  లేక స్క్రిప్టుతో లాక్ చేయగలిగే ఇతర దర్శకుడికి కమిటవుతారా? అన్నది వేచి చూడాల్సి ఉంటుంది.