Begin typing your search above and press return to search.

ఈ బ్యూటీ వెబ్ సిరీస్ క్రేజ్.. సినిమాలకు కలిసి వస్తుందా..??

By:  Tupaki Desk   |   15 Jun 2021 6:37 AM GMT
ఈ బ్యూటీ వెబ్ సిరీస్ క్రేజ్.. సినిమాలకు కలిసి వస్తుందా..??
X
ఇండియన్ సినీలవర్స్ ఈ మధ్యకాలంలో భాషాబేధం లేకుండా సినిమాలు వెబ్ సిరీస్ చూస్తూ ఆదరించేస్తున్నారు. ఇదివరకు సినిమాలు చేసినా దొరకని క్రేజ్ - గుర్తింపు ఇప్పుడు కేవలం ఓ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ చేస్తే చాలా అనేవిధంగా పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇండస్ట్రీలో మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. ఈ మార్పులను సీనియర్ హీరోయిన్స్ చాలా బాగా వాడుకుంటున్నారు. ఇదివరకు హీరోయిన్స్ వెలిగినప్పుడు ఎలాగో అందాలతో ఇండస్ట్రీని షేక్ చేశారు. కానీ ఇప్పుడు వయసు ఫ్యామిలీ గుర్తు పెట్టుకొని గ్లామర్ రోల్స్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు.

ఇటీవలే అలాంటి బోల్డ్ ఫ్యామిలీ లేడీ రోల్ పోషించి మన్ననలు పొందుతుంది సౌత్ సీనియర్ బ్యూటీ ప్రియమణి. ప్రస్తుతం ప్రియమణి పేరు సోషల్ మీడియాలో ఇండస్ట్రీ వర్గాలలో మారుమ్రోగుతుంది అంటే కారణం ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్. ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సెకండ్ సీసన్ రిలీజ్ అయింది. ఊహించినట్లుగానే వెబ్ సిరీస్ సక్సెస్ అందుకుంది. అలాగే అందులో యాక్టర్లకు కూడా బ్లాక్ సినిమా తీసిన దొరకని క్రేజ్ లభిస్తుంది. ప్రస్తుతం అలాంటి క్రేజ్ నే ఎంజాయ్ చేస్తోంది ప్రియమణి. దాదాపు పదిహేనేళ్లు అమ్మడు ఇండస్ట్రీలో గ్లామర్ గుప్పించింది. అలాగే అవార్డులు కూడా అందుకుంది.

కొన్నేళ్లుగా ప్రియమణి హీరోయిన్ కాకుండా సైడ్ రోల్స్ చేస్తోంది. ఇప్పటివరకు అమ్మడు తెలుగుతో పాటు తమిళ - కన్నడ - మలయాళం భాషల్లో కూడా సినిమాలు చేసేసింది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం వెబ్ సిరీస్ ద్వారానే పరిచయమైంది. అలాగే ఓటిటి సిరీస్ ద్వారానే నార్త్ రాష్ట్రాలలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ది ఫ్యామిలీ మ్యాన్ క్రేజ్ తో తెలుగులో నటిస్తున్న సినిమాలకు కలిసి వస్తుందని టాక్. ఎందుకంటే ప్రస్తుతం తెలుగులో ప్రియమణి వెంకటేష్ సరసన నారప్పతో పాటు విరాటపర్వం సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. మరి కెరీర్ లో ఫస్ట్ టైం వెంకటేష్ తో సినిమా చేస్తోంది. అదికూడా నేచురల్ క్యారెక్టర్.. చూడాలి మరి ప్రియమణి క్రేజ్ ఈ సినిమాలకు ఎలా కలిసి వస్తుందో..!