Begin typing your search above and press return to search.

మన మైఖేల్ వాళ్లకు నచ్చుతాడా..?

By:  Tupaki Desk   |   31 Jan 2023 8:00 AM GMT
మన మైఖేల్ వాళ్లకు నచ్చుతాడా..?
X
యువ హీరో సందీప్ కిషన్ కి టాలెంట్ బాగానే ఉన్నా లక్ కలిసి రాకపోవడంతో కెరీర్ లో వెనకపడ్డాడు. కుర్రాడికి మంచి సినిమా పడితే మాత్రం ఇప్పటికే ఓ రేంజ్ లో ఉండాల్సిన వాడు.. కానీ కథల సెలక్షనో.. లేక అన్ లక్కీ నో కానీ తనని ఇంకా యువ హీరోగానే ఉంచాయి. తన మార్క్ సినిమాలు చేస్తూ వస్తున్న సందీప్ కిషన్ సరైన హిట్ దక్కించుకోవడంలో మాత్రం వెనకపడ్డాడు. ఇక ప్రస్తుతం మైఖేల్ అంటూ మరో మూవీతో వస్తున్నాడు సందీప్ కిషన్.

రంజిత్ జయకోడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగేలా చేశాయి. సందీప్ కిషన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న మైఖేల్ సినిమా ఫిబ్రవరి 3న పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడమే కాకుండా సినిమాలో సందీప్ కిషన్ క్యారెక్టర్ ఆడియన్స్ కి బాగా ఎక్కేలా ఉంది. ఇక మాస్ యాక్షన్ తో పాటుగా రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీటితో పాటుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ఉన్నాడు.

మైఖేల్ సినిమాలో విజయ్ సేతుపతి స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాడు. ఈ సినిమాను బీ టౌన్ ఆడియన్స్ కూడా మెచ్చేలా ఉంటుందని అంటున్నారు. పుష్ప సినిమా హిందీ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ కి అక్కడ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అదే తరహాలో మైఖేల్ లో సందీప్ కిషన్ పాత్రకు కూడా ఆడియన్స్ అంతే కనెక్ట్ అవుతారని అంటున్నారు. మరి మన మైఖేల్ వాళ్లని మెప్పించడం లో సక్సెస్ అవుతాడా లేదా అన్నది చూడాలి.

సందీప్ కిషన్ మాత్రం ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. మైఖేల్ సినిమాలో మజిలీ ఫేం దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సామ్ సిఎస్ మ్యూజిక్ అందించారు. ఒకప్పటి హీరో వరుణ్ సందేష్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో డిఫరెంట్ గెటప్ తో కనిపిస్తున్నారు. మరి సందీప్ కిషన్ మైఖేల్ వీరత్వం ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.