బాలయ్య మరో ఏటీటీ మూవీ రానుందా?

Fri Oct 30 2020 15:40:14 GMT+0530 (IST)

Will there be another ATT movie of Balayya?

శ్రేయాస్ ఈటీ వారి ఎనీ టైమ్ థియేటర్ (ఏటీటీ) ద్వారా పాత సినిమాలు.. చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి. మద్యలో ఆగిపోయిన క్రేజీ ప్రాజెక్ట్ లు శ్రేయాస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తమిళ అర్జున్ రెడ్డి 'వర్మ' ను తీసుకు వచ్చిన శ్రేయాస్ ఏటీటీ వారు ఆ తర్వాత బాలకృష్ణ నటించిన నర్తనశాల సినిమాను కూడా విడుదల చేశారు. 17 నిమిషాల పాటు సాగిన బాలయ్య నర్తన శాల సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ఆ డబ్బును ఛారిటీ కోసం వినియోగించబోతున్నట్లుగా ప్రకటించడంతో బాలయ్య అభిమానులు తమ వంతు సాయంకు ముందుకు వచ్చారు. ఇప్పుడు బాలయ్య మరో ఆగిపోయిన సినిమా కూడా ఏటీటీ ద్వారా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానుల్లో టాక్ వినిపిస్తుంది.చాలా ఏళ్ల క్రితం బాలయ్య హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్ గోపాల్ రెడ్డి నిర్మాణంలో ప్రారంభం అయిన విక్రమ సింహ భూపతి సినిమా దాదాపు సగం షూట్ పూర్తి అయిన తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూల కారణంగా సినిమాను ఆపేశారు. ఆ తర్వాత సినిమాను మళ్లీ మొదలు పెట్టిందే లేదు. ఆ సినిమా గురించి అభిమానులు ఇప్పటికి కూడా కోరుకుంటూ ఉన్నారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమాను పూర్తి చేసే అవకాశం లేదు. కనుక ఉన్న దాన్ని విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విక్రమ సింహ భూపతి సినిమాను విడుదల చేసేందుకు శ్రేయాస్ ఈటీ వారు ప్రయత్నాలు చేయాలని నందమూరి అభిమానులు కోరుతున్నారు.