బాలయ్య త్రివిక్రమ్ మూవీ ఉంటుందా?

Wed Jul 21 2021 05:00:01 GMT+0530 (IST)

Will there be a Balayya Trivikram movie

నందమూరి బాలకృష్ణ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబోలో సినిమా ఉంటుందా అనే చర్చ ప్రస్తుతం సినీ మరియు మీడియా వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది. ఎందుకంటే బాలకృష్ణ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ఆ సమయంలోనే హాసిని హారిక వారి బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు. ఇప్పటి వరకు హాసిని అండ్ హారిక బ్యానర్ ల్లో ఎక్కువగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మాత్రమే సినిమాను చేయడం జరిగింది. ఇప్పుడు బాలకృష్ణ వారితో సినిమా ఉందంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆ సినిమా కు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ కాంబో ను ఎవరు ఊహించి ఉండరు. బాలయ్య ప్రకటన తర్వాత ఎక్కువ మంది ఈ కాంబో గురించి మాట్లాడుతున్నారు. కాని కొందరు మాత్రం బాలయ్య చేయబోతున్న సినిమాకు త్రివిక్రమ్ డైరెక్షన్ ఉండక పోవచ్చు అంటున్నారు.హాసిని అండ్ హారిక బ్యానర్ అధినేత రాధాకృష్ణ ఆధ్వర్యంలోనే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ రన్ అవుతుంది. కనుక బాలకృష్ణ తో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సినిమా ఉండే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాధాకృష్ణ బ్యానర్ లో అనే ఉద్దేశ్యంతో బాలకృష్ణ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు. గతంలో ఒకటి రెండు సార్లు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో బాలయ్య ఓ రీమేక్ లో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ రీమేక్ పట్టాలెక్కలేదు కాని సదరు బ్యానర్ లో బాలయ్య మూవీ ఉంటుందని తాజా వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చినట్లయ్యింది. అయితే దర్శకుడు త్రివిక్రమ్ కాకుండా మరెవ్వరైనా అయ్యి ఉండవచ్చు.

బాలయ్య తన అఖండ సినిమా తర్వాత వరుసగా చేయబోతున్న సినిమాల గురించి క్లారిటీ ఇచ్చాడు. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయడంతో పాటు ఆ తర్వాత అనీల్ రావిపూడితో ఒక సినిమా ఉంటుంది.. తన సినిమా ఒకటి ఉందని చెప్పిన ఆయన హారిక వారితో కూడా ఒక సినిమా చేయాల్సి ఉందని చెప్పాడు. ఇక నెలలో మూడు సినిమాలు చేయగల సత్తా తనకు ఉందని.. నాలుగు నెలల్లో మూడు సినిమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను అని.. మళ్లీ పాత రోజులు రావాలని కోరుకుంటున్నట్లుగా బాలయ్య చెప్పుకొచ్చాడు.