టాలెంటెడ్ డైరెక్టర్ ఈసారి సాలిడ్ హిట్ కొడతాడా..?

Fri Nov 25 2022 11:00:01 GMT+0530 (India Standard Time)

Will the talented director Shailesh make a solid hit this time

2020లో "హిట్: ది ఫస్ట్ కేస్" చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు శైలేష్ కొలను. నాని సమర్పణలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రం హిట్ అయింది. కరోనా వైరస్ ప్రభావం పడినప్పటికీ.. ఓవరాల్ గా పర్వాలేదనిపించుకుంది. ఇక దర్శకుడిగా శైలేష్ తొలి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్నాడు. హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు.ఈ నేపథ్యంలో శైలేష్ కు వెంటనే బాలీవుడ్ లో సినిమా చేసే అవకాశం దక్కింది. తన "హిట్" చిత్రాన్ని అదే పేరుతో దిల్ రాజు ప్రొడక్షన్ లో రాజ్ కుమార్ రావుతో హిందీలో రీమేక్ చేసాడు. ఈ ఏడాది జూలైలో విడుదలైన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే వివిధ కారణాల వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పనిచేయలేదు. దీంతో శైలేష్ బాలీవుడ్ ఎంట్రీ అనుకున్న విధంగా జరగలేదు.

ఈ క్రమంలో ఇప్పుడు "హిట్: ది సెకండ్ కేస్" అంటూ వస్తున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్. వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

'హిట్ 2' చుట్టూ నెలకొన్న హైప్ దృష్ట్యా ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయితే దీన్ని ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. కాకపొతే ముందుగా తెలుగులో విడుదల చేసి.. ఆ తర్వాత సరైన డేట్ చూసి హిందీలోకి తీసుకెళ్లే ఆలోచనలో వున్నారు.

"మేజర్" చిత్రంతో అడివి శేష్ పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. హిందీలో అతని సినిమాల పట్ల ఆసక్తి నెలకొంది. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు అక్కడ ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అందులోనూ ఇది ఇటీవలి సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ కేసుకి దగ్గరగా ఉన్న పాయింట్ తో తెరకెక్కించి. కాబట్టి ఇప్పుడు ''హిట్ 2'' సినిమా బాలీవుడ్ లో పనిచేసే అవకాశం ఉంది. 

"హిట్ 2" చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లుగా హీరో అడివి శేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. డబ్బింగ్ పనులు అన్నీ సరిగ్గా చేసి ప్రాపర్ గా రిలీజ్ చేస్తే.. ఈ చిత్రం హిందీలోనూ సూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

'హిట్ 1' మరియు 'హిట్' హిందీ రీమేక్ తో శైలేష్ కొలను డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ.. కమర్షియల్ హిట్లు అందుకోలేకపోయారు. టాలెంటెడ్ డైరెక్టర్ ఈసారి మాత్రం సాలిడ్ హిట్ అందుకొని 'హిట్' ఫ్రాంచైజీ మీద అంచనాలు రెట్టింపు చేయాలని భావిస్తున్నారు. 'హిట్ 3' లో అడివి శేష్ తో పాటుగా నేచురల్ స్టార్ నాని మరియు మక్కల్ సెల్వన్ విజయ్ సేతపతి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.