భారతీయ తొలి టాకీ సినిమా ఎప్పటికైనా దొరుకుతుందా?

Tue May 17 2022 12:34:51 GMT+0530 (IST)

Will the first Indian talkie film ever be available

భారతీయ తొలి టాకీ సినిమా ఏదంటే ప్రతి ఒక్కరూ ఆలం ఆరా అని చెప్పేస్తుంటారు. అయితే 1931లో ఈ సినిమాను ప్రింట్ చేసిన ఒక పాత మెషీన్ ను శివేంద్ర సింగ్ దుంగార్పూర్ ఆయన బృందం కనుగొంది. శివేంద్ర సింగ్ సినీ దర్శకుడు. పాత సినిమాలను సేకరించడం. భద్రపరచడం ఆయన ఆసక్తులలో ఒకటి. ముంబయిలో ఓ చీరల దుకాణంలో ఈ మూలన పడి ఉంది ఈ మెషీన్. దీన్ని చికాగోలోని బెల్ అండ్ హావెల్ కంపెనీ తయారు చేసింది. దీని అసలు ఓనర్ సినీ నిర్మాత ఆర్ధెశిర్ ఇరానీ కాగా... దీన్ని ఆయన నుంచి నళిన్ సంపత్ కొనుగోలు చేశారు.సంపత్ కు ముంబయిలో ఫిల్మ్ స్టూడియో ప్రాసెసింగ్ లేబరేటరీ ఉండేది. ఆలం ఆరాకు సంబంధించిన మిగిలి ఉన్న కళాఖండం ఇదొక్కటే. ఇది తప్ప ఆ సినిమాకు సంబంధం ఉన్నదేదీ అందుబాటులో లేదని దుంగార్పూర్ అన్నారు. అయితే 1962లో ఈ మెషీన్ ను కొనడానికి సంపత్ కుటుంబం 2500 రూపాయలు చెల్లించింది. అప్పట్లో వీరి కంపెనీ ప్రభుత్వ సంస్థ అయిన ఫిల్మ్ డివిన్ రూపొందించిన సినిమాలను ప్రింట్ చేసింది. 2000 సంవత్సరం వరకు ఇది కొనసాగింది.

"ఇది చాలా సాధారణ ఫిల్మ్ ప్రింటింగ్ మెషిన్. కానీ దీంతో మాకు భావోద్వేగమైన అనుబంధం ఉంది. 2000 సంవత్సరం నుంచి సినిమాలు డిజిటల్ కు మారిపోవడంతో... మేం దీన్ని ఉపయోగించడం మానేశాం" అని సంపత్ అన్నారు. కొన్ని దశాబ్దాలుగా దుంగార్పూర్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేన్ నడుపుతున్నారు. ముంబై కేంద్రంగా పనిచేసే ఈ లాభాపేక్ష లేని కంపెనీ ఆలం ఆరా ప్రింట్ కోసం అనేక ప్రయత్నాలు చేసినా విఫలం అయింది.

ఈ సినిమాకు సంబంధించిన ఆధారాలు ఏమైనా లభిస్తే తెలియజేయాలని సోషల్ మీడియాలో కూడా దుంగార్పూర్ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సినిమా కాపీ అల్జీరియాలోని ఓ ఫిల్మ్ ఆర్కైవ్ లో ఉందని... అక్కడ ఇంకా అనేక భారతీయ సినిమాలు ఉన్నాయని తెలిపింది కానీ మీరే ఇక్కడకు వచ్చి ఈ ఆర్కైవ్ లో వెత్తుకోవాలని తెలిపింది. కానీ దుంగార్పూర్ అక్కడకు వెళ్లలేక పోయారు. అలాగే ఈ సినిమా లోని ఫిల్మ్ ఆర్కైవ్ లో ఉండొచ్చని మరో ఆధారం కూడా లభించింది.

ఈ సినిమాకు సంబంధించిన ఏ ఒక్క ప్రింట్ కూడా మనకు ఇప్పటికీ లభించి లేదు. కానీ ఈ సినిమా పూర్తిగా కనిపించకుండా పోయిందంటే నేను నమ్మలేనంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆలం ఆరా కు సంబంధించి మిగిలి ఉన్నది కేవలం కొన్ని ఫోటోలు పోస్టర్లు ఒక ప్రమోషన్ బుక్ లెట్ మాత్రమే. ముంబయిలోని సినిమాలు అమ్ముకునే దుకాణం ఉన్న వ్యక్తి దగ్గర మాత్రమే ఆలం ఆరా కు సంబంధించిన బుక్ లెట్ ఒకటి మాత్రం ఉంది.