'గాలిసంపత్'కి ఆ డైరెక్టర్ సపోర్ట్ ప్లస్ అవుతుందా..??

Sat Jan 23 2021 21:00:01 GMT+0530 (IST)

Will the director support for Galisampath be a plus ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు అనిల్ రావిపూడి. పటాస్ సినిమా నుండి గతేడాది మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ వరకు హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం తన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు. విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ కథానాయకులుగా ఎఫ్3 సినిమా రూపొందిస్తున్నాడు అనిల్. దిల్ రాజు నిర్మాణంలో ఈసారి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రెడీ చేస్తున్నారట. ఇక దర్శకుడుగా కెరీర్ మొదలవక ముందు అనిల్ చాలా సినిమాలకు రచయితగా పనిచేసాడు. తాజాగా మరోసారి తను డైరెక్షన్ చేయని సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు అనిల్. అంతేగాక ఇటీవల అదనపు బాధ్యతలు కూడా తీసుకున్నట్లు స్వయంగా ప్రకటించాడు. యువహీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా గాలిసంపత్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఆ సినిమాకు అనిల్ స్క్రీన్ ప్లే పాలు కామెడీ సీక్వెన్స్ అందించాడట.అయితే బేసిగ్గా గాలిసంపత్ సినిమాకు అనీష్ కృష్ణ దర్శకుడు. అయితే డైరెక్టర్ మీద నమ్మకం ఉన్నప్పటికీ అనిల్ రైటింగ్ తో పాటు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్నీ కూడా స్వయంగా అనిల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ ద్వారా తెలిపాడు. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అనిల్.. గాలిసంపత్ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేయడం ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాయడానికి మొదట్లో ప్లాన్ చేసాను. ఇప్పుడు ఈ బాధ్యత తీసుకొని సినిమాకు మరింత సపోర్ట్ చేస్తున్నాను. టీమ్ వర్క్ కే ఇంపార్టెన్స్ ఇస్తా అందుకే ఈ బాధ్యతలు తీసుకున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తను వర్క్ లో ఉన్నట్లు ఓ వీడియో కూడా పోస్ట్ చేసాడు అనిల్.. ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడట. ఇదివరకు రాజమౌళి మొదటి సినిమాకి రాఘవేంద్రరావులాగా అనీష్ కృష్ణకు అనిల్ సపోర్ట్ చేస్తున్నాడు. చూడాలి మరి గాలిసంపత్ ఎలా ఉండబోతుందో!!