బ్యాచిలర్ కు మరో వారం కలిసి వచ్చేనా?

Thu Oct 21 2021 10:38:30 GMT+0530 (IST)

Will the bachelor get together another week

అఖిల్ అక్కినేని ఆరు ఏళ్ల కెరీర్ లో మొదటి కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ దసరా కానుకగా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు పోటీగా విడుదల అయిన మహాసముద్రం మరియు పెళ్లిసందడి సినిమాలు నిరాశ పర్చాయి. ఆ సినిమాలపై బ్యాచిలర్ పై చేయి సాధించాడు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ వసూళ్లను దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదటి వారంలో ఈ సినిమా మంచి వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో రెండవ వారంలో వచ్చే వసూళ్లు లాభాలుగా ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు. అయితే రెండవ వారం లో బ్యాచిలర్ ఎంత వరకు ప్రభావం చూపించగలడు అనేది చర్చనీయాంశంగా మారింది.రేపు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు నాట్యం తో పాటు మరో రెండు మూడు చిన్న సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి. వాటిలో నాట్యం తప్ప మరే సినిమాలు కూడా పెద్దగా బజ్ ను కలిగి లేవు. నాట్యం సినిమా కూడా బి.. సి సెంటర్లలో నడుస్తుందా అనే నమ్మకం లేదు. మెగా కాంపౌడ్ చిరంజీవి.. చరణ్.. ఉపాసనలతో పాటు బాలయ్య కూడా నాట్యంను ప్రమోట్ చేశారు. అయినా కూడా సినిమా పై క్లాస్ ముద్ర కనిపిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత బి.. సి సెంటర్లలో వసూళ్లు పెరిగే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఆలోపు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా వసూళ్లను కంటిన్యూ చేస్తుంది.

మొత్తంగా ఈ వారంలో కూడా ప్రేక్షకులకు ప్రథానంగా కనిపించే సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కనుక ఖచ్చితంగా అఖిల్ రెండవ వారంలో కూడా మంచి వసూళ్లను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న సినిమాలు విడుదల కాని కారణంగా వసూళ్ల పరంగా బ్యాచిలర్ కు కలిసి వచ్చే అంశం అంటున్నారు. బ్యాచిలర్ తో పాటు పెళ్లి సందడికి కూడా కాస్త వసూళ్లు నమోదు అవుతాయని అంటున్నారు. మహాసముద్రం ఇప్పటికే చాలా థియేటర్ల నుండి తొలగించారనే టాక్ ఉంది. కనుక ఆ సినిమా కు ఈ వారం కూడా కలిసి రాకపోవచ్చు. ఈ వారం ఖచ్చితంగా మెజార్టీ ట్రేడ్ బ్యాచిలర్ కు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.