Begin typing your search above and press return to search.

యండమూరి వారి మరో ప్రయత్నం ఫలించేనా?

By:  Tupaki Desk   |   26 July 2021 12:30 AM GMT
యండమూరి వారి మరో ప్రయత్నం ఫలించేనా?
X
రచయితగా సక్సెస్ చవి చూసిన ప్రతి ఒక్కళ్లు దర్శకుడిగా కూడా విజయవంతమవుతారని చెప్పలేం. కారని చెప్పలేం. తెలుగు నాట ఎంతో మంది రచయితలు దర్శకులుగా మారి తమ సత్తా చాటారు. మరి కొంత మంది ఢీలా పడ్డారు. అలా ఢీ లా పడ్డ వారిలో సూపర్ హిట్ కథా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఒకరు. ఆయన తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ నవలల్ని రూపొందించారు. కానీ సినీ దర్శకుడిగా మాత్రం ఫెయిలయ్యారు. తన నవలల ఆధారంగా ఎంతో మంది తెలుగు దర్శకులు సూపర్ హిట్ సినిమాలు తీసి ఔరా అనిపించుకున్నారు. కానీ ఈ రచయితను మాత్రం విధి వెక్కిరించింది.

తన నవల ఆధారంగానే మెగా స్టార్ చిరంజీవిని హీరోగా పెట్టి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ అనే సినిమా తీసి.. చేతులు కాల్చుకున్నాడు. చిరంజీవి లాంటి మెగా స్టార్ నటించినా కూడా సినిమా హిట్ కాకపోవడంతో నిరాశ చెందిన యండమూరి తర్వాత మరలా మెగా ఫోన్ పట్టలేదు. ఇలా తన సినీ కెరీర్ ను యండమూరి వీరేంద్రనాథ్ అర్ధాంతరంగా ముగించారు. అయినా కానీ ఎక్కడో చిన్న వెలతిగా ఉండడంతో చాన్నాళ్ల తర్వాత మరలా దర్శకత్వ శాఖకు ప్రాతినిథ్యం వహించేందుకు మరలా సిద్ధమయ్యాడు. ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో తన నవలనే సినిమాగా రూపొందిస్తున్నాడు. కానీ చాలా ఏళ్ల తర్వాత మరలా యండమూరికి సినిమా తీయాలనే ఆశ పుట్టినట్లుంది. తన సూపర్ హిట్ నవలనే సినిమాగా తీసేందుకు పూనుకున్నాడు.

ఈ మధ్యే సినిమాను కూడా ఘనంగా ఆరంభించాడు. ఈ ప్రారంభోత్సవ ఫంక్షన్ కు సీనియర్ డైరెక్టర్ కోదండరామి రెడ్డి, మెగా బ్రదర్ నాగబాబు హాజరయ్యారు. ఇక్కడ గమనార్హం ఏంటంటే మెగా బ్రదర్ నాగబాబు ఆ మధ్యన రచయిత యండమూరిని తీవ్రంగా దూషించాడు. అయినా కానీ యండమూరి వీరేంద్రనాథ్ మాత్రం తన సినిమా ఫంక్షన్ ను మెగా బ్రదర్ ను ఆహ్వానించండం ఆశ్చర్యకరం. ప్రస్తుతం యండమూరి వీరేంద్ర నాథ్ తీస్తున్నది కూడా తన పాత నవలే నట. ఈ పాత నవలను ఈ రైటర్ ఈ తరానికి తగ్గట్టు మార్పులు చేసి తీస్తున్నాడో, లేక అలాగే ఉన్నది ఉన్నట్లుగా తీస్తున్నాడో సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాలి.

యండమూరి వీరేంద్ర నాథ్ సక్సెస్ కాలేకపోయినా... ఆయన రచించిన నవలలను ఆధారం చేసుకుని ఎంతో మంది దర్శకులు హిట్లు కొట్టారు. కానీ యండమూరికి మాత్రం హిట్ రాక తన ప్రయోగం విఫలమయి చేతులు కాలాయి. ఇక ఆ దెబ్బతో చాన్నాళ్ల పాటు మెగా ఫోన్ పట్టని ఈ సీనియర్ రైటర్ మరలా తన కోరికను అణుచుకోలేక దర్శకుడిగా మారి మెగా ఫోన్ అందుకోనున్నారు. మరి ఈ సారైనా ఈ సీనియర్ రైటర్ కు హిట్ దక్కుతుందో లేదో వేచి చూడాలి. ఈ మూవీలో నటిస్తున్న తారాగణం, పని చేస్తున్న టెక్నీషియన్ల వివరాలు త్వరలో అధికారిక ప్రకటనతో తెలిసే చాన్స్ ఉంది.