Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్లు బాలీవుడ్ స్టార్ల‌ను వెన‌క్కి నెట్టేస్తారా?

By:  Tupaki Desk   |   22 March 2023 6:00 PM GMT
టాలీవుడ్ స్టార్లు బాలీవుడ్ స్టార్ల‌ను వెన‌క్కి నెట్టేస్తారా?
X
గ‌డిచిన నాలుగేళ్ల‌లో సౌత్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. సౌత్ స్టార్ల‌కు విజ‌యాల శాతం పెరిగింది. స్థిరంగా బంప‌ర్ హిట్లు.. పాన్ ఇండియా లెవ‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుంటూ హ‌వా సాగిస్తున్నారు. 1000 కోట్ల క్ల‌బ్ అనేది సౌత్ హీరోలు ప్ర‌భాస్ - రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్-య‌ష్ వంటి స్టార్ల‌కు సాధ్య‌మైంది. ఇక‌పై రేసులో మ‌హేష్ కూడా చేరుతున్నాడు. అయితే బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ లో సౌత్ స్టార్ల వాటా అంత‌కంత‌కు పెర‌గాలంటే .. బాలీవుడ్ స్టార్ల‌కు ధీటుగా బ్రాండింగ్ ప్యాకేజీలు కాంట్రాక్టులు ద‌క్కాలంటే మ‌న స్టార్లు ఏం చేయాలి? అన్న‌ది ఓ ప్ర‌ముఖ విశ్లేష‌కుడు విశ్లేషించారు.

తార‌లుగా నిరంత‌రం లైమ్ లైట్ లో ఉంటూ విజ‌యాల్ని ఆస్వాధిస్తూ.. ప్ర‌తిసారీ ఇండియా లెవ‌ల్లో రికార్డులు తిర‌గ‌రాస్తూ.. సోష‌ల్ మీడియాల్లోను అసాధార‌ణ ఫాలోయింగ్ ని పెంచుకోవ‌డం ద్వారా బాలీవుడ్ స్టార్ల‌కు ధీటుగా సౌత్ స్టార్లు బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ లో ఎదిగేందుకు ఆస్కారం ఉంద‌ని ప్ర‌ముఖ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌ ట్రేడ్ విశ్లేష‌కుడు జైన్ విశ్లేషించారు. 2016 నాటికి అస‌లు సౌత్ వాటా లేనే లేదు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అంత‌గా బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేసేవాళ్లు లేరు. కానీ 2022నాటికి ప‌రిస్థితి అమాంతం మారింది. ఇప్పుడు 4 శాతం వాటాను మార్కెట్లో కైవ‌శం చేసుకున్నారు.

40-50 మిలియన్ల మంది ఫాలోవర్లతో దక్షిణ భారత సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా స్టాండింగ్ విష‌యంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా అత‌డు విశ్లేషించారు. చాలా మంది బాలీవుడ్ తారలకు 150 మిలియన్లకు పైగా సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్నారని జైన్ పేర్కొన్నారు.

డిజిటల్ ప్రచారాల కోసం.. బ్రాండ్ ల కోసం సంప్రదాయ బాలీవుడ్ ప్రముఖులు లేదా క్రికెట్ స్టార్ లు కార్పొరెట్ల‌కు మొదటి ఎంపిక కావచ్చు. ఇంత పోటీ ఉన్న‌ప్ప‌టికీ స్థిరమైన హిట్ లు సాపేక్షంగా వేగంగా పెరుగుతున్న సోషల్ మీడియా ఫాలోయింగ్ కారణంగా దక్షిణాది తారలు కొత్త ఎండార్స్ మెంట్ ఒప్పందాలను పెంచుకుంటున్నారు.

53.5 మిలియన్లు.. 52.5 మిలియన్లు.. 48.1 మిలియన్లు.. 47.1 మిలియన్లు .. 37.3 మిలియ‌న్ల‌తో.. తమన్నా భాటియా- సమంత రూత్ ప్రభు- అల్లు అర్జున్- రష్మిక మందన్న- మహేష్ బాబు వ‌రుస‌గా సోషల్ మీడియా ఫాలోయింగ్ లో మొదటి ఐదుగురు దక్షిణ భారత సెలబ్రిటీలుగా ఏల్తున్నారు.

ట్విట్టర్- ఇన్‌స్టాగ్రామ్ లో స‌ద‌రు స్టార్ల‌కు భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అయితే ఉత్త‌రాది సెల‌బ్రిటీల‌కు 150 మిలియ‌న్ల వ‌ర‌కూ ఫాలోయింగ్ ఉంది. అంటే ఇంకా రెండొంతులు త‌మ ఫాలోయింగ్ ని స‌ద‌రు ద‌క్షిణాది తార‌లు పెంచుకోవాల్సి ఉంటుంద‌ని కూడా జైన్ విశ్లేషించారు. సోష‌ల్ మీడియాల్లో ద‌క్షిణాది తార‌లు మ‌రింత ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేయాల‌ని కూడా ఆయ‌న అన‌లైజ్ చేసారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.