ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఉన్నట్టా లేనట్టా..??

Sun Jun 26 2022 12:00:40 GMT+0530 (IST)

Will The Project Exists For Actor

టాలీవుడ్ బిగ్ స్టార్ ఒకరు ఇటీవల కాలంలో వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అందులో ఓ యువ దర్శకుడితో కమిటైన సినిమా కూడా ఉంది. ఓ బడా బ్యానర్ ఈ చిత్రాన్ని బ్యాంక్ రోల్ చేయడానికి రెడీ అయింది.ఇప్పటికే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమా కోసం హీరోకి అడ్వాన్స్ గా భారీ మొత్తాన్ని చెల్లించినట్లు టాక్. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లకుముందే ఆగిపోయిందని.. హీరో తన అడ్వాన్స్ ని కూడా తిరిగి ఇచ్చేశాడని రూమర్లు వినిపిస్తున్నాయి.

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ఆ హీరో ఈ మధ్య కాలంలో నటించిన ఓ పెద్ద సినిమా పరాజయం పాలవడమే కారణమని తెలుస్తోంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ప్రతిష్టాత్మక చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అవడంతో ఆయన ఆలోచలు పూర్తిగా మారిపోయాయట.

రాబోయే ప్రాజెక్ట్స్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. కథ - స్క్రిప్ట్ ప్రాధాన్యతతో పాటుగా మిగతా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని అంటున్నారు.

ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని 2023 చివరికల్లా విడుదల చేయాలట. ప్రస్తుతం ఆయన లైనప్ లో ఉన్న సినిమాలను చూస్తే.. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే. అవి కంప్లీట్ అయిన తర్వాతే ఈ ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉంది. అందుకే ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారని అంటున్నారు.

అయితే ఇటీవల దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ధ్రువీకరించారు. ఫిలిం సర్కిల్స్ లో మాత్రం ఇప్పట్లో లేనట్లే అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. దీంతో హీరో అభిమానులు అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే గందరగోళంలో ఉన్నారు. మరి త్వరలో దీనిపై మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.