'మహర్షి' కోసం సుకుమార్ వస్తాడా? రాడా?

Thu Apr 25 2019 15:51:41 GMT+0530 (IST)

Will Sukumar Come For Maharshi Pre Release Event

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం 'మహర్షి' మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మహర్షి చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను మే 1న భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహేష్ కెరీర్ లో ఇది 25వ చిత్రం అవ్వడం వల్ల సిల్వర్ జూబ్లీ వేడుక మాదిరిగా ఇది జరపాలనే ఉద్దేశ్యంతో నిర్మాతలు ఉన్నారు. ఇక ఈ వేడుకలో మహేష్ బాబుతో ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్క దర్శకుడు కూడా హాజరు అయ్యేలా చూస్తున్నారు. ఇప్పటికే మహేష్ తో సినిమా చేసిన దర్శకులకు సమాచారం వెళ్లిందట. వారిని స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు కలిసి ఆహ్వానం అందించినట్లుగా తెలుస్తోంది. అందుబాటులో లేని వారికి కూడా సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఈ వేడుకలో మహేష్ బాబుతో '1 నేనొక్కడినే' చిత్రంను తెరకెక్కించిన సుకుమార్ పాల్గొంటాడా అనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతోంది. వీరిద్దరి కాంబోలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా అభిప్రాయ భేదాల కారణంగా క్యాన్సిల్ అయ్యింది. ఆ సమయంలో ఇద్దరి మద్య గ్యాప్ కాస్త ఎక్కువగానే అయినట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. క్రియేటివ్ విభేదాలు వచ్చిన కారణంగా తమ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నట్లుగా మహేష్ బాబు స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. సుకుమార్ మాత్రం మహేష్ తో మూవీ క్యాన్సిల్ విషయంపై స్పందించలేదు.

తనను సంవత్సరం పాటు ఎదురు చూసేలా చేసి తనతో సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడు అంటూ మహేష్ బాబుపై సుకుమార్ కోపంగా ఉన్నాడనే గుసగుసలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో 'మహర్షి' వేడుకలో సుకుమార్ పాల్గొంటాడా వచ్చినా మహేష్ పక్కన నిల్చుంటాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఇద్దరి మద్య మరీ అంత పెద్ద విభేదాలు ఏమీ రాలేదని తప్పకుండా ఇద్దరు కలిసి భవిష్యత్తులో వర్క్ చేస్తారనే నమ్మకం ఉంది ఈ వేడుకలో కూడా మహేష్ కోసం సుకుమార్ పాల్గొంటాడనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఈ వేడుకలో సుకుమార్ కనుక హాజరు కాకుంటే ఇద్దరి మద్య విభేదాలు సీరియస్ గానే అయినట్లుగా పరిగణించవచ్చు.