యువ రక్తం రావడం.. ఓల్డ్ అయిన వారు తెరమరుగైపోవడం ప్రతీ రంగంలోనూ కామన్. సినిమాల్లో అయితే ఇది కేవలం హీరోయిన్స్ కే వర్తిస్తోంది. హీరోలు ఎంత ఏజ్ బార్ అయినా సరే తమకున్న క్రేజ్ ని కాపాడు కుండా కంటిన్యూ అవుతుంటారు. కానీ హీరోయిన్ లు మాత్రం అలా కాదు. వన్స్ క్రేజ్ తగ్గిందా సైడ్ క్యారెక్టర్లు తల్లి పాత్రలకు ఫిక్సయిపోతుంటారు. అలా చేసినా కొన్ని సందర్భాలలో యంగ్ హీరోయిన్ లు వారిని డామినేట్ చేస్తుంటారన్నది తెలిసిందే.
ఇదిలా వుంటే టాలీవుడ్ లో అందాల చందమామగా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ కి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. 'ఆచార్య' సమయంలో పెళ్లి చేసుకున్న కాజల్ ఆ తరువాత వెంటనే ఓ బాబుకు జన్మనివ్వడం తెలిసిందే. పెళ్లైనా సరే కాజల్ సినిమాల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. ఎలాంటి క్యారెక్టర్లైనా చేయడానికి వెనుకాడటం లేదు. ప్రస్తుతం యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో 'ఇండియన్ 2'లో నటిస్తున్న కాజల్ తాజాగా మరో సీనియర్ హీరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
అఖండ' వీర సింమారెడ్డి వంటి వరుస విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో వున్న నందమూరి బాలకృష్ణ కథనాయాకుడిగా అనిల్ రావిపూడి ఓ భారీ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్స్ సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇందులో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అయితే ఇందులో బాలకృష్ణకు కూతురిగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తోందంటూ ఇటీవల అనిల్ రావిపూడి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఇదే కాజల్ ఫ్యాన్స్ ని కలవరానికి గురిచేస్తోందట. 'ధమాకా'లో మాస్ రాజానే డామినేట్ చేసిన శ్రీలీల ఈ మూవీలో కాజల్ ని కనిపించకుండా చేస్తుందేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. కాజల్ కు శ్రీలీల కూతురు అంటే చూడ్డానికి బాగోదని స్క్రీన్ పై ఆ దృశ్యాలని చూడలేమని ఫీలవుతున్నారట. 'ఆచార్య' నుంచి చివరి నిమిషంలో తప్పుకున్న కాజల్ కు ఇది కూడా అదే అనుభవాన్ని కలిగిస్తుందని కామెంట్ లు చేస్తున్నారట.
ఇదిలా వుంటే పెళ్లైన కాజల్ ఈ రోజుల్లో క్రేజీ హీరోల ప్రాజెక్ట్ లని పట్టుకోవడం కష్టమని ప్రస్తుతం వున్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని వచ్చిన అవకావాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్లాల్సిందేనని బాలయ్య అనిల్ రావిపూడి మూవీ కాజల్ కెరీర్ ను సరి కొత్త మలుపు తప్పడం ఖాయమని మరి కొందరు వాదిస్తున్నారట. కాజల్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా బాలయ్య సినిమాకు రెడీ అయిపోవడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.