నెక్ట్స్ ఏంటి? దసరా- సంక్రాంతి బరిలో..?

Fri Jun 18 2021 22:00:01 GMT+0530 (IST)

Will Sankranthi theaters be open?

2021 సమ్మర్ మిస్సయ్యింది. కనీసం దసరా అయినా క్లిక్కవుతుందా? కరోనా మహమ్మారీ సెకండ్ వేవ్ నెమ్మదిస్తోంది కాబట్టి తిరిగి గత ఏడాది సీన్ రిపీటవుతుందా? వరుస రిలీజ్ లతో సందడి తెస్తారా? అంటూ సినీప్రియుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.దసరా రేస్ లో పుష్ప 1 (ది రైజర్) రిలీజ్ కి వచ్చే వీలుంది. ఈ మూవీ పతాక సన్నివేశాల్ని చైనాలో తెరకెక్కించే ప్లాన్ లో ఉంది. అలాగే ఇండియా అన్ని భాషలతో పాటు చైనాలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని అంచనా. ఆచార్య సినిమాను దసరా లేదా సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ ఉంది. ఇదే దసరా సీజన్ లో వచ్చేందుకు నాగశౌర్య రెండిటిని రెడీ చేస్తున్నారట. ఇంకో మూవీ 40శాతం పూర్తవ్వాల్సి ఉంది. వరుస రిలీజ్ ల ప్లాన్ లో నాగశౌర్య ఉన్నారట.

ఇక సంక్రాంతి బరిలో కన్ఫామ్ గా వచ్చేవి ఏవి? అంటే.. సర్కార్ వారి పాట మిగిలి ఉన్న పెద్ద షెడ్యూల్ పూర్తి చేసి సంక్రాంతి 2022 బరిలో దిగాలన్నది ప్లాన్. అలాగే అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ 2022 సంక్రాంతి కి వస్తుందా?  లేక సంక్రాంతికి చాలా ముందు లేదా చాలా దూరంగా వస్తుందా? అన్నది చిత్రబృందం ప్రకటించాల్సి ఉంది. పవన్ - మహేష్ సినిమాలు కాబట్టి గ్యాప్ మెయింటెయిన్ చేసే వీలుంది.

జూలై చివరిలో మూడు నాలుగు క్రేజీ సినిమాలు రిలీజయ్యేందుకు ఆస్కారం ఉంది. లవ్ స్టోరి వచ్చే నెల మూడోవారం ఉంటుంది. విరాఠపర్వం- టక్ జగదీష్ లాంటి చిత్రాలు ఇదే సీజన్ లో వచ్చే వీలుంది. సుప్రీంహీరో సాయి తేజ్ రిపబ్లిక్ రిలీజ్ కి రెడీ.. ఎనీ టైమ్ డేట్ ప్రకటించే ఛాన్సుందిట. వరుణ్ తేజ్ గని కూడా సడెన్ గా దిగిపోతుంది.

ప్రభాస్ రాధేశ్యామ్ ఓటీటీలోనా థియేటర్లలోనా? అన్నది ఇంకా తేలాలి. డార్లింగ్ తదుపరి ఆదిపురుష్ - సలార్ చిత్రీకరణలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  జూలై మొదలు దసరా వరకూ మధ్యలో ఓ 25 చిన్నా చితకా సినిమాల్ని వదిలేసే వీలుంది. సంక్రాంతి కి ముందు క్రిస్మస్ కి చాలామంది రిలీజ్ లకు ప్లాన్ చేసే అవకాశం ఉంది.

దేనికైనా థర్డ్ వేవ్ రాకుండా 70శాతం వ్యాక్సినేషన్ తో వైరస్ స్ప్రెడింగ్ ని నిలువరించగలిగితేనే ఇవన్నీ ముందుకు సాగేందుకు అవకాశం ఉంది. 50శాతం ఆక్యుపెన్సీ నెమ్మదిగా 75శాతానికి 100శాతానికి చేరుకుంటేనే భారీ చిత్రాలను రిలీజ్ చేసి రిటర్నులు తేగలరని విశ్లేషిస్తున్నారు.