సమంత ప్రధాన పాత్రలో నటించిన తొలి మైథలాజికల్ మూవీ 'శాకుంతలం'. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని స్వీయ దర్శకత్వంలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించారు. 3డీ ఐమ్యాక్స్ ఫార్మాట్ లలో అత్యంత భారీ స్థాయిలో ఈ ఎపిక్ లవ్ స్టోరీని రిలీజ్ చేయబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లోనూ ఈ మూవీ విడుదల కానుంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ క్రేజీ డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్ కు కేవలం 17 రోజులు మాత్రమే వుండటంతో చిత్ర బృందం త్వరలో ప్రమోషన్స్ ని ఫాస్టప్ చేయబోతోంది. 'శాకుంతలం' లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్. సమంతే మెయిన్ దీనికి. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించినా అతను తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం వున్న వ్యక్తి కాదు.
సో ఈ సినిమా కోసం ఏది చేసినా సమంతే చేయాలి. సమంతే ప్రమోషన్స్ లో పాల్గొనాలి. మరి సామ్ 'శాకుంతలం' ప్రమోషన్స్ లో పాల్గొంటుందా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. సమంత గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతోంది. 'యశోద' మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా తను సెలైన్ బాటిల్ తో డబ్బింగ్ చెబుతున్న ఓ ఫొటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి షాకిచ్చింది. తాను గత కొంత కాలంగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోందని స్పష్టం చేసింది.
సామ్ చేసిన ప్రకటనతో అభిమానులు సెలబ్రిటీలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తను త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్తిస్తున్నామని మళ్లీ మీరు రెట్టించిన ఉత్సాహంతో తిరిగి కోలుకుంటారని సామ్ కు మానసిక ధైర్యాన్నిచ్చారు. తన ఆరోగ్య సమస్య కారణంగా సామ్ 'యశోద' ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయింది. కానీ సుమకు ప్రత్యేకంగా ఓ వీడియో ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చింది. సామ్ పరిస్థితిని గమనించిన మేకర్స్ కూడా తనని ప్రమోషన్స్ కి రమ్మని ఇబ్బంది పెట్టలేదు.
అయితే 'శాకుంతలం' విషయానికి వచ్చే సరికి బడ్జెట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. సమంత ప్రమోట్ చేస్తేనే ఈ మూవీకి అనుకున్నస్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయి. ప్రేక్షకలు కూడా భారీ స్థాయిలో సింపతీ కోసం థియేటర్లకు వస్తారు. అందుకే మేకర్స్ సామ్ ని ఎలాగైనా ప్రమోషన్స్ కోసం భారీ స్థాయిలో వాడేయాలని భావిస్తున్నారట. ఇదే సమయంలో తనకు ఎలాంటి ట్రెస్ ని కలిగించకూడదని కూడా భావిస్తున్నారట.
'శాకుంతలం' భారీ స్థాయిలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా. దీన్ని ప్రమోట్ చేయాలంటే గుణశేఖర్ ఒక్కరే చేయలేరు. సమంత ఖచ్చితంగా ప్రమోషన్స్లో యాక్టీవ్ గా పాల్గొన వలసిందే. మరి ఈ నేపథ్యంలో సామ్ అనుకున్నట్టుగానే 'శాకుంతలం' ప్రమోషన్స్ లో యాక్టీవ్ గా పాల్గొంటుందా? లఏదా అన్నది తెలియాలంటే మూవీ ప్రమోషన్స్ మొదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.