'రంగమార్తాండ' కృష్ణవంశీ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా..?

Fri Mar 17 2023 13:00:01 GMT+0530 (India Standard Time)

Will 'Rangamarthanda' Krishnavamsi plan work out..?

క్రియేటివ్ డైరెక్టర్ ట్యాగ్ లైన్ కు పర్ఫెక్ట్ అనిపించే డైరెక్టర్ కృష్ణవంశీ కొన్నాళ్లుగా ఆయన తన మార్క్ సినిమాలు తీయడంలో వెనకపడ్డారు. కృష్ణవంశీ సినిమా అంటే సినిమా తప్పకుండా చూడాలని అనుకునే ఆడియన్స్ కాస్త ఆయన పని అయిపోయింది అనుకునేలా కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే కొద్దిపాటి గ్యాప్ తర్వాత రంగమార్తాండా సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు కృష్ణవంశీ. మరాఠి సినిమా నట సామ్రాట్ కి రీమేక్ గా వచ్చిన రంగమార్తాండ సినిమా ఉగాది కానుకగా రిలీజ్ ఫిక్స్ చేశారు.ఈ సినిమా రిలీజ్ కు ముందు సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి కలిగించేందుకు స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే దర్శకులందరికీ స్పెషల్ ప్రీమియర్స్ వేసిన కృష్ణవంశీ వారి రెస్పాన్స్ ని కూడా ప్రమోషన్స్ గా వాడుకుంటున్నారు. ఈమధ్య కంటెంట్ బేస్డ్ సినిమాలు కొన్ని ఇదేవిధంగా ముందు ప్రీమియర్స్ వేసి పాజిటివ్ టాక్ తో రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ గా రిలీజైన సార్ బలగం సినిమాలు ఇదే పంథా కొనసాగించాయి.

ఇప్పుడు కృష్ణవంశీ రంగమార్తాండ కూడా అదే తరహాలో ముందు ప్రీమియర్స్ వేసి సూపర్ అనిపించుకుని ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అమ్మా నాన్న కథ అంటూ వస్తున్న రంగమార్తాండ సినిమా చూసిన దర్శకులంతా కూడా ఇది కదా అసలు కృష్ణవంశీ అంటూ చెప్పుకొచ్చారు. కొందరు దర్శకులు సినిమా చూసి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. సినిమాలో నిజంగానే అంత మ్యాటర్ ఉంది అంటే కృష్ణవంశీ మరోసారి తన ప్రతిభ చాటినట్టే అని చెప్పొచ్చు.

కమర్షియల్ సినిమా.. స్టార్ సినిమాలకు ముందు పబ్లిసిటీ చేసినా చేయకపోయినా ఓపెనింగ్స్ వస్తాయి. కానీ రంగమార్తాండ లాంటి సినిమాలకు ఎంత పబ్లిసిటీ చేసి ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేస్తే అంత మంచి రిజల్ట్ అందుకుంటుంది. మరి ఈ విషయంలో రంగమార్తాండ టీం సక్సెస్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ప్రకాశ్ రాజ్ రమ్యకృష్ణ బ్రహ్మానందం రాహుల్ సిప్లిగంజ్ శివాత్మిక అలి రెజా అనసూయ నటించిన రంగమార్తాండ ప్రేక్షకులను మెప్పించడంలో ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.