Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తి గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాను ర‌జ‌నీ బ్రేక్ చేస్తారా?

By:  Tupaki Desk   |   10 Jun 2023 8:00 AM GMT
ద‌ళ‌ప‌తి గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాను ర‌జ‌నీ బ్రేక్ చేస్తారా?
X
సినీ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ ఎప్పుడూ పోలిక చూసే టాపిక్. అలాగే కేర‌ళ‌ లో లియో వ‌ర్సెస్ జైలర్ థియేట్రికల్ హక్కుల మధ్య పోలిక ను అభిమానులు చూస్తున్నారు. లియో-జైలర్ రెండూ ఈ సంవత్సరం థియేట్రికల్ విడుదల కు సిద్ధమవుతున్నందున కేర‌ళ‌ లో ఇప్ప‌టికే ఇవి వ్యాపారాన్ని ముగించాయి. లియో కేరళ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రూ. 16 కోట్ల తో రికార్డు సృష్టించింద‌ని... కేరళ లో ప్రీ-రిలీజ్ బిజినెస్ లో ఉత్త‌మ తమిళ చిత్ర‌మిదేన‌ని చ‌ర్చ సాగుతోంది.

రజనీకాంత్- మోహన్ లాల్-శివ‌రాజ్ కుమార్ న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ 'జైలర్' కేరళ లో విజయ్ 'లియో' రికార్డు ను బద్దలు కొట్టలేకపోయిందనేది మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. లియో కేర‌ళ పంపిణీ హ‌క్కులు 16కోట్లు చెల్లించ‌గా.. జైల‌ర్ కి 10కోట్ల లోపు బిజినెస్ జ‌రిగింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఆస‌క్తిక‌రంగా ఈ రెండు సినిమాల‌ ను ఒకే పంపిణీదారు సొంతం చేసుకున్నార‌ని తెలిసింది. జైలర్ కేరళ పంపిణీ హక్కుల ను కూడా విజయ్ 'లియో' హక్కుల్ని సీల్ చేసిన అదే డిస్ట్రిబ్యూటర్ దక్కించుకున్నాడు.

అయితే ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ కీలక పాత్ర లో నటించిన రజనీకాంత్ చిత్రం లియో కంటే ఉత్త‌మ బిజినెస్ చేయ‌లేక‌పోయింద‌నేది టాక్. అయినా జైల‌ర్ భారీ మ‌ల్టీస్టార‌ర్ కావ‌డం తో మ‌రీ అంత తీసికట్టుగా బిజినెస్ ని ముగించ‌లేదు. ర‌జ‌నీకాంత్ కి వ‌య‌సు రీత్యా స‌మ‌స్య‌లున్నాయి.

దీంతో అత‌డి లో మునుప‌టి వేగం మంద‌గించింద‌ని సినిమాలు కూడా ఫ్లాపుల‌వ్వ‌డం తో అత‌డి సినిమాల‌ బిజినెస్ పై ప్ర‌భావం ప‌డుతోంద‌న్న గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి. జైల‌ర్ లేదా లియో పెట్టుబడిదారుల కు లాభదాయకమైన చిత్రాలు గా మారడానికి కేర‌ళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాల్సి ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ చిత్రంలో సౌత్ సూప‌ర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్ర లో న‌టించ‌గా.. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ రాజ్ కుమార్.. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహన్ లాల్- సునీల్- జాకీ ష్రాఫ్- రమ్యకృష్ణ- తమన్నా- వసంత్ రవి తదితర భారీ తారాగ‌ణం నటించారు. మరోవైపు గ్యాంగ్ స్టర్ డ్రామా 'లియో'లో విజయ్ ప్రధాన పాత్ర లో న‌టించ‌గా కేజీఎఫ్ 2 అధీరా పాత్ర‌ధారి సంజయ్ దత్ విల‌న్ గా న‌టించడం క్రేజ్ ను అమాంతం పెంచింది.

ఇందులో అర్జున్ సర్జా- త్రిష- గౌతమ్ మీనన్- మన్సూర్ అలీ ఖాన్ - ప్రియా ఆనంద్- మాథ్యూ థామస్- మిస్కిన్- శాండీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే రజనీకాంత్ నటించిన చిత్రాని కి కూడా అనిరుధ్ సంగీతం అందిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.