టీజర్ తో అయినా బజ్ క్రియేట్ అయ్యేనా?

Fri Jul 08 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Will Ponniyin Selvan Teaser Create Buzz

దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీస్ హవా నడుస్తోంది. అంతే కాకుండా పీరియాడికల్ ఫిక్షనల్ స్టోరీస్ కి ఆదరణ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వున్నక్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని చాలా మంది స్టార్ డైరెక్టర్స్ స్టార్ హీరోలు పీరియాడిక్ ఫిక్షనల్ కథాంశాలతో భారీ చిత్రాలని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు సెట్స్ పై వుండగా ఈ వరుసలో మణరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది.మణిరత్నం అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నమూవీ 'పొన్నియిన్ సెల్వన్'. ఛోళరాజుల కాలం నాటి పీరయాడిక్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. గత కొంత కాలంగా ఈ మూవీని తెరపైకి తీసుకరావాలని  ప్రయత్నాలు చేసిన మణిరత్నం ఎట్టకేలకు లైకా ప్రొడక్షన్స్ అండతో ఈ చారిత్రక చిత్రాన్ని రెండు భాగాలుగా తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఫస్ట్ పార్ట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

విక్రమ్ ఐశ్వర్యారాయ్ కార్తి త్రిష జయం రవి తదితర కీలక నటీనటవర్గం నటిస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 30న ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ  సందర్బంగా గత నాలుగు రోజుల నుంచి ఈ చిత్రంలోని కీలక పాత్రలని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్లని విడుదల చేస్తున్నారు. కానీ ఎక్కడ ఈ మూవీపై బజ్ క్రియేట్ కావడం లేదు. మణిరత్నం చిత్రాలకు తెలుగులో మంచి క్రేజ్ వుండేది. కానీ ప్రస్తుతం ఆ స్థాయి క్రేజ్ కనిపించడం లేదు.

500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'పొన్నియిన్ సెల్వన్' కు మణిరత్నం అంచనా ప్రకారం బాహుబలి రేంజ్ బజ్ క్రియేట్ కావాలి. అక్కడ ఈ మూవీని కోలీవుడ్ బాహుబలిగా అభివర్ణిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు విక్రమ్ కార్తి ఐశ్వర్యారాయ్ త్రిషలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లని విడుదల చేశారు. నో బజ్.

జూలై 8న టీజర్ ని రిలీజ్ చేయడానికి భారీగా ప్లాన్ చేస్తున్నారట. ఇందు కోసం చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారట. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి టీజర్ తో అయినా బజ్ క్రియేట్ అయ్యేనా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లైకాతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం ఈ మూవీని దాదాపు 500 కోట్లతో నిర్మిస్తున్నారు. మిగతా భాషల్లో బజ్ క్రియేట్ కాని పక్షంలో భారీ మూల్యం చెల్లించక తప్పదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. విజయ్ శ్రీదేవి కీలక పాత్రల్లో గతంలో 'పులి' పేరుతో ఓ ఫాంటసీ అడ్వెంచర్ ని రూపొందించారు. 130 కోట్లతో నిర్మించిన ఈ మూవీ వంద కోట్లని కూడా రాబట్టలేకపోయిన విషయం తెలిసిందే.