Begin typing your search above and press return to search.

పవన్​-మహేశ్​ పోటీ పడనున్నారా.. అసలేంది ఈ గందరగోళం

By:  Tupaki Desk   |   30 Jan 2023 5:00 PM GMT
పవన్​-మహేశ్​ పోటీ పడనున్నారా.. అసలేంది ఈ గందరగోళం
X
చిత్రసీమలో స్టార్ హీరోల సినిమాలు సాధారణంగానే పండగ బరిలో దిగుతుంటాయి. దసరా, దీపావళి, సంక్రాంతి బరిలో మరో హీరో చిత్రాలతో పోటీ పడుతుంటాయి. అలా ఈ ఏడాది దసరాకి, వచ్చే సంక్రాంతి కోసం.. దర్శకనిర్మాతలు.. ఇప్పటి నుంచే కర్చీఫ్​లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ఈ దసరాకు వచ్చే చిత్రాల్లో కొంతకాలంగా ప్రముఖంగా వినిపస్తున్న పేర్లు 'హరి హర వీరమల్లు', మహేశ్​ 'ఎస్​ఎస్​ఎంబీ 28'. అయితే ఈ రెండు సినిమాలు దసరాకు వస్తాయా లేదా అన్నది ప్రస్తుతం సందిగ్ధంగా మారింది.

ఎందుకంటే పవన్​కల్యాణ్​ అటు రాజకీయాల్లోనూ బిజీగా ఉండటం, మరోవైపు ఈ చిత్రం భారీ హంగులతో తెరకెక్కడం.. ఇలా పలు కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ చిత్రాని దసరాకే విడుదల చేయాలని మేకర్స్​ గట్టిగా ప్రయత్నిస్తున్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అలాగే దాదాపు 12ఏళ్ల తర్వాత మహేశ్​బాబు-త్రివిక్రమ్​ కాంబోలో వస్తున్న సినిమా ఎస్​ఎస్​ఎంబీ 28. అతడు ఖలేజా తర్వాత వస్తున్న ఈ హ్యాట్రిక్ కాంబోపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రం కూడా రిలీజ్​ డేట్​ విషయంలో గందరగోళంగా ఉంది.

గతంలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్​ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేష‌న్స్. కానీ మహేశ్ తండ్రి కృష్ణ హ‌ఠాన్మ‌ర‌ణంతో చాలా రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. దీంతో టార్గెట్​లోపు షూటింగ్ పూర్తికావ‌డం క‌ష్టం కావ‌డంతో మళ్లీ ఆగ‌స్ట్ 11కు మార్చారని తెలిసింది. అనంతరం దసరకు రిలీజ్​ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఏది నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే దసరా బరిలో హరిహర వీరమల్లు, ఎస్​ఎస్​ఎంబీ 28కు పోటీ ఖాయమే.

మరోవైపు వచ్చే సంక్రాంతికి వరకు ఈ ఆలస్యమవుతాయా అంటే అదీ కూడా క్లారిటీ అవ్వట్లేదు. దాదాపుగా ఈ చిత్రాలను అప్పటివరకు పోస్ట్ పోన్​ చేయకుండా ఉండటానికి దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఎందుంకటే వచ్చే సంక్రాంతికి ఇప్పటికే పలువురు హీరోల సినిమాలు కన్ఫామ్​ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2, ఆర్​ సీ 15, ఎన్​బీకే 108, నాగార్జున కొత్త సినిమా ఇలా పలు చిత్రాలు పతకాల పండకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఒకవేళ ఈ చిత్రాల రిలీజ్​ డేట్స్​ సంక్రాంతికి కన్ఫామ్​ అయితే.. ఈ పోటీలో దిగడం కష్టమని ఎస్​ఎస్​ఎంబీ, హరిహర వీరమల్లు మేకర్స్​తో మరి కొన్ని చిత్రాల మేకర్స్​ జంకుతున్నారట. చూడాలి మరి ఏం జరుగుతందో.

ఇక ఎస్​ఎస్​ఎంబీ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో పూజాహెగ్డేతో పాటు శ్రీలీల మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. సినిమా ఇది. హారిక హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా విషయానికొస్తే.. 17వ శతాబ్దం నాటి చారిత్రక కథనంతో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా యాక్షన్‌ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్‌కల్యాణ్ కెరీర్‌లోనే భారీబడ్జెట్‌, పాన్ ఇండియా, చారిత్రక నేపథ్యం లాంటి విశేషాలతో రూపుదిద్దుకుంటోంది. నిధి అగర్వాల్, నర్గీస్‌ ఫక్రీ , అర్జున్‌రామ్‌పాల్‌ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుడు బెన్‌లాక్ ‌ ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్‌ హంగులను సమకూరుస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.